కర్నూలు జిల్లాలో దారుణం .. భార్య, అత్తను నరికి చంపేసిన భర్త
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను కూడా ఓ కసాయి భర్త నరికి చంపేశాడు. ఈ దారుణం జిల్లాలోని కౌతాలం మండలం, బాపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక, టెక్కలికోటకు చెందిన రమేశ్ అనే వ్యక్తికి కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవి అనే యువతితో రెండు నెలల క్రితం వివాహమైంది. అయితే, భార్య మహాలక్ష్మిపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అత్తగారింటికి వచ్చిన రమేష్.. నిద్రపోతున్న భార్య, ఆయన అత్త హనుమంతమ్మను అత్యంత కిరాతకంగా చంపేశాడు.
ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాలు ఉంచి తాళం వేసి కర్నాటకకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రమేష్ కోసం గాలించాల్సివుంది.