శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (17:54 IST)

ఈ నెల 12వ తేదీన విద్యాకానుక పంపిణీ : మంత్రి బొత్స

vidya kit
వేసవి సెలవులు తర్వాత ఏపీలో ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభంకానున్నాయి. అదేరోజున విద్యార్థులకు జగనన్న విద్యా కానుకకు సంబంధించిన విద్యా కిట్లను ప్రదానం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ.2500 విలువైన విద్యా కానుక కిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులోని క్రోసూరలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్లను ప్రదానం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 40 లక్షల మంది ఈ కిట్లను అందజేస్తామని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రోత్సాహకాలను సీఎం అందజేస్తారన్నారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా అమ్మఒడి కార్యక్రమం జరుగుతుందన్నారు. 
 
టెన్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరలా అదే తరగతిలో రెగ్యులర్‌గా చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స వెల్లడించారు.