మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:38 IST)

తమిళనాడులో ఖా'కీచక' పర్వం : ఐపీఎస్ మహిళా అధికారికి వేధింపులు

దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణలో మొదటిస్థానంలో ఉండే తమిళనాడు రాష్ట్రంలో ఓ ఐపీఎస్ స్థాయి లేడీ ఆఫీసరుకు లైంగిక వేధింపులు తప్పలేదు. డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఆమెను లైంగికవాంఛ తీర్చాలంటూ వేధించాడు. ఇదే విషయాన్ని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. దీంతో విచారణకు ఓ కమిటీని రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఆమె ఆరోపణలపై సదరు ఉన్నతాధికారి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
 
ఇదిలావుంటే, ప్రధాని మోడీ చెన్నై పర్యటన సమయంలో ఆ అధికారిని దూరం పెట్టారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుండగా, ఆ బాధ్యతల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని దూరం పెట్టినట్టు అధికారులు తెలిపారు.
 
మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల అహంకారానికి ఇది నిదర్శనమని, ఇలాంటి పోలీసు అధికారులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన మహిళా అధికారిని మెచ్చుకుంటున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు.