గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (14:16 IST)

వయసు ఉంటే రాసుకోవచ్చు.. అంతేగానీ... : సుప్రీంకోర్టు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత యేడాది సివిల్స్ పరీక్ష రాయలేక పోయిన అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వయసు ఉంటే రాసుకోవచ్చని, కనీస వయసు పైబడిన వారు మాత్రం ఈ యేడాది రాసేందుకు అనుమతించలేమని పేర్కొంది. 
 
ఈ మేరకు గత ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్‌కు దరఖాస్తు చేసుకుని, పరీక్షకు హాజరు కాలేకపోయిన అభ్యర్థుల పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. పరీక్షకు కావాల్సిన అర్హత వయసు అభ్యర్థులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. 
 
కరోనా నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయామని, కరోనా మహమ్మారితో పలుమార్లు పరీక్షలూ వాయిదా పడ్డాయని, తమలో కొందరికి అదే చివరి అవకాశమని పేర్కొంటూ ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో మరో అవకాశం ఇవ్వాలని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  
 
అయితే, వయసు అయిపోకపోయి ఉంటే గత ఏడాది అభ్యర్థులకు ఈ ఏడాది ప్రిలిమ్స్‌లో మరో అవకాశం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ, న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కావడంతో కేంద్రం మిన్నకుండిపోయింది. దీంతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
కరోనా నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయామని, కరోనా మహమ్మారితో పలుమార్లు పరీక్షలూ వాయిదా పడ్డాయని, తమలో కొందరికి అదే చివరి అవకాశమని పేర్కొంటూ ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో మరో అవకాశం ఇవ్వాలని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  
 
ఈ పిటిషన్‌‍పై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆఖరి అవకాశంలో పరీక్షకు హాజరు కాకపోయినా ఆ అవకాశం పోయినట్టేనని, గతేడాదితోటే వారి అవకాశాలన్నీ ముగిసిపోయాయని పేర్కొంది. వయసున్న వారే మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని స్పష్టం చేసింది.
 
కాగా, ఈ ఏడాది ప్రిలిమ్స్‌కు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 3 వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చింది. జూన్ 27న పరీక్ష నిర్వహించనున్నారు.