మటన్‌ బిర్యానీ 160 - జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రతిదానికీ లెక్క...

Biryani
Biryani
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 20 నవంబరు 2020 (09:11 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే, ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు ప్రకటిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రచార పర్వంలోకి దిగిపోతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో ముందుకుసాగిపోతున్నారు.

అయితే, ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.5 లక్షలు దాటడానికి వీల్లేదని ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ప్రచార సమయంలో అంతకు మించి ఖర్చు చేసినట్లు తేలితే అభ్యర్థిపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రచార సమయంలో ఎంత ఖర్చు పెడుతున్నారన్నది కీలకం కానుంది. తాగే నీటి నుంచి రోడ్‌ షోల్లో వినియోగించే సౌండ్‌ బాక్స్‌ల వరకు ప్రతి దానికో లెక్క ఉండాలి. ఎన్నికల వేళ ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారన్నది గుర్తించేందుకు డివిజన్ల వారీగా పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రచారంలో పాల్గొనే వారికి వాటర్‌ పాకెట్‌ ఇచ్చినా, చాయ్‌ తాగించినా ఎన్నికల ఖర్చు కిందకే వస్తుందని ఎస్ఈసీ పేర్కొంది.

కాగా, ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరల ప్రకారం ఖర్చుల వివరాలు ఇలావున్నాయి.

టీ, కాఫీ రూ.5, 10
వాటర్‌ ప్యాకెట్‌ రూ.1
వాటర్‌ బాటిల్‌ 200 ఎం.ఎల్‌ రూ.5
వాటర్‌ బాటిల్‌ 500 ఎంఎల్‌ రూ.10
వాటర్‌ బాటిల్‌ 1 లీటరు రూ.20
పులిహోర 300 గ్రాములు రూ.35
ఆలు సమోస రూ.10
వెజ్‌ బిర్యానీ 750 గ్రాములు రూ.100
చికెన్‌ బిర్యానీ 750 గ్రాములు రూ.150
ఎగ్‌ బిరియానీ 750 గ్రాములు రూ.120
మటన్‌ బిరియానీ 750 గ్రాములు రూ.160
వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌ రూ.80
ఇడ్లీ ప్లేటు (4) రూ.20
వడ ప్లేటు (4)
రూ.20
శాఖాహార భోజనం రూ.70దీనిపై మరింత చదవండి :