1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:26 IST)

ప్లేటు బిర్యానీ కోసం 42 బస్సులు తగులబెట్టిన యువతి.. ఎక్కడ?

ఇటీవల కర్నాటక రాజధాని బెంగుళూరులో 42 బస్సులను తగుబెట్టిన విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారనీ ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ఈ బస్సులను తగులబెట్టింది కర్నాటక ఆందోళనకారులు కాదనే విషయం

ఇటీవల కర్నాటక రాజధాని బెంగుళూరులో 42 బస్సులను తగుబెట్టిన విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారనీ ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ఈ బస్సులను తగులబెట్టింది కర్నాటక ఆందోళనకారులు కాదనే విషయం తేటతెల్లమైంది. 
 
బెంగళూరుకు చెందిన సి.భాగ్య అనే 22 ఏళ్ల యువతి కేవలం ప్లేటు మటన్ బిర్యానీ, వంద రూపాయల నగదు కోసమే రంగంలోకి దిగి 42 బస్సులను దహనం చేసిందని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు నిర్ధారించారు. నిందితురాలైన భాగ్య కేపీఎన్ గ్యారేజీ సమీపంలోని గిరినగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
రోజూ వారీ కూలీ అయిన భాగ్య పనికెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కావేరి జలవివాదంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటే బిర్యానీతోపాటు వందరూపాయలు ఇస్తారని భాగ్య వెళ్లిందని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు. భాగ్యతో పాటు మరో 11 మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.