శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (14:25 IST)

రూ.6లు చిల్లర అడిగినందుకు లవ్‌లెటర్ ఇవ్వమన్నాడు.. కండెక్టర్, డ్రైవర్ ఏం చేశారంటే?

ఓ యువతిపై కండెక్టర్ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బెంగళూరులో బీఎంటీసీ బస్సులో ప్రయాణీస్తున్న యువతిపై కండెక్టర్ లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 10వ తేదీన రాగిగ

ఓ యువతిపై కండెక్టర్ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బెంగళూరులో బీఎంటీసీ బస్సులో ప్రయాణీస్తున్న యువతిపై కండెక్టర్ లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 10వ తేదీన రాగిగుడ్డ నుంచి ఉత్తరహళ్ళి వైపు వెళ్ళే బస్సులో ప్రయాణిస్తున్న యువతి పట్ల కండక్టర్‌ లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధిత యువతి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
 
రాగిగుడ్డలో 500సి బీఎం టీసీ బస్సులో ఉత్తరహళ్ళికి బయల్దేరగా బనశంకరి బస్టాప్‌లో దాదాపు ప్రయాణీకులందరూ దిగేశారు. మరో యువతి కదిరేనహళ్ళి పెట్రోల్‌ బంక్‌ బస్టాఫ్‌లో దిగగా ఒంటరిగా మిగిలాక డ్రైవర్‌, కండక్టర్‌లు అసభ్యకరంగా ప్రవర్తించారని పోస్టు చేశారు. రాత్రి పది గంటలు అయ్యేసరికి.. బస్సు డ్రైవర్, కండెక్టర్ వేధించడంతో బస్సు నుంచి దూకేయాలని అనిపించిందని బాధిత మహిళ తెలిపింది. 
 
రూ. రూ.6లు చిల్లర అడిగినందుకు లవ్‌లెటర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. డ్రైవర్‌ కూడా కండక్టర్‌తో పాటు వేధించారన్నారు. తాను కూర్చున్న సీటు వద్దకే వచ్చి కండక్టర్‌ అసభ్యంగా మాట్లాడడాన్ని పోస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు స్పందించి విచారణలకు సిద్ధమయ్యారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు.