శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 మార్చి 2017 (14:22 IST)

మోదీకి భారీ షాక్... ప్రధాని పీఠంపై యోగీ ఆదిత్యనాథ్ గురి...

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగీ ఆదిత్యనాథ్ కాబోయే దేశ ప్రధానమంత్రి అంటూ ఆయన మద్దతుదారులు అప్పుడే మొదలుపెట్టేశారు. ఈ వార్త భాజపాకు కాస్త షాకింగ్ ఇచ్చేదే అయినప్పటికీ యోగీ ఆదిత్యనాథ్ మద్దతుదారులు

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగీ ఆదిత్యనాథ్ కాబోయే దేశ ప్రధానమంత్రి అంటూ ఆయన మద్దతుదారులు అప్పుడే మొదలుపెట్టేశారు. ఈ వార్త భాజపాకు కాస్త షాకింగ్ ఇచ్చేదే అయినప్పటికీ యోగీ ఆదిత్యనాథ్ మద్దతుదారులు మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గటం లేదు. కాబోయే భారత ప్రధాని యోగీ అంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకుంటూ వెళుతున్నారు.
 
ఆఖరికి యోగీ ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బాసిత్ సైతం తన కుమారుడు ఏదో ఒకరోజు ఈ దేశాన్ని నడిపే నాయకుడవుతారని తనకు పూర్తి విశ్వాసం వున్నదన్నారు. నేడు దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ తదుపరి దేశానికే నేత కానున్నారని హరిద్వార్ జ్ఞాని మహంత్ మన్వేంద్ర వ్యాఖ్యానించారు. 
 
ఆదిత్యనాథ్ సన్నిహితుల్లో మరొకరు మాట్లాడుతూ... యోగీ ఆదిత్యనాథ్‌ను దగ్గర నుంచి చూసినవారికి ఆయన తప్పకుండా భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వుంటారనీ, ఐతే ఆ తర్వాత 2024లో మాత్రం దేశ ప్రధాని యోగీ ఆదిత్యనాథ్ అవుతారని జోస్యం చెప్పారు. వీరి ఆశల సంగతేమోగానీ ఈ వ్యాఖ్యలు మాత్రం నరేంద్ర మోదీకి షాకిచ్చేవిగా వున్నాయనడంలో సందేహం లేదు.