వీకెండ్ స్పెషల్ : చీజ్ చికెన్ కబాబ్ ఎలా చేయాలి!

శనివారం, 28 ఫిబ్రవరి 2015 (18:57 IST)
పాల ఉత్పత్తులతో శరీరానికి కావలసిన క్యాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు బలపడుతాయని వైద్యులు అంటున్నారు. అలాంటి పాల ఉత్పత్తుల్లో ఒకటైన చీజ్‌తో చికెన్ కబాబ్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ : అర కేజీ 
లెమన్ జ్యూస్ : పావు కప్పు 
ఫ్రెష్ క్రీమ్ : పావు కప్పు 
చీజ్ : ఒక కప్పు 
మైదా : అర కప్పు 
నూనె, ఉప్పు : తగినంత 
కొత్తిమీర తరుగు : పావు కప్పు 
రెడ్ చిల్లీ పౌడర్ : ఒక టీ స్పూన్లు 
గరం మసాలా పౌడర్ : ఒక టీ స్పూన్లు 
బటర్ : పావు కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని బోన్ లెస్ చికెన్, చీజ్, గరం మసాలా, చిల్లీ పౌడర్, ఉప్పు, మైదా, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు, లెమన్ జ్యూస్ అన్నింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత కబాబ్ స్టిక్స్‌లో చికెన్‌ కూర్చి అరగంట పక్కన బెట్టేయాలి. మరో బాణలిలో నూనె పోసి వేడయ్యాక చికెన్ ముక్కల్ని అందులో దోరగా వేపుకోవాలి. వీటిని సర్వ్ చేసేందుకు ముందుగా కాసింత వేడి చేసుకుంటే మరింత టేస్ట్‌గా ఉంటాయి. అలాగే సర్వ్ చేసే ముందు కాస్త చికెన్ ముక్కలకు బటర్ రాయాలి. అంతే చీజ్ చికెన్ కబాబ్ రెడీ.

అన్నీ చూడండి

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా?

అన్నీ చూడండి

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

ఇండస్ట్రీలో చీకటి కోణాలు అనేకం.. మగాడు టచ్‌ చేయగానే ఆడపిల్లకి అర్థమైపోతుంది : సింగర్ సునీత

Show comments