Daily Horoscope
✕

సండే స్పెషల్ వంటకం... చికెన్ లెగ్ పీసెస్‌తో...

Written By సిహెచ్
Updated: శనివారం, 5 అక్టోబరు 2019 (21:41 IST)
 
కావలసిన పదార్థాలు :
చికెన్ తొడలు- నాలుగు
వెనిగర్- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- పది
అల్లంముద్ద- ఒక టీస్పూను
వెల్లుల్లిముద్ద- ఒక టీస్పూను
పెరుగు- 300 గ్రాములు
గరంమసాలా పొడి- ఒక టీస్పూను
నూనె- రెండు టీస్పూన్లు
కొత్తిమీర- ఒక కట్ట
పుదీనా ఆకు రెమ్మలు- కొద్దిగా
ఉప్పు- సరిపడా
చాట్ మసాలా పొడి- ఒక టీస్పూను
పసుపు- కొంచెం
 
తయారీ విధానం :
కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. నాలుగు చికెన్ తొడలకు చాకుతో లోతుగా గంట్లు పెట్టి వెనిగర్ ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్దని బాగా పట్టించి పావుగంటసేపు నానబెట్టుకోవాలి. పెరుగు బాగా చిలికి ఉప్పు, గరం మసాలా పొడి, నూనె వేసి బాగా డైల్యూట్ చేసి చికెన్ ముక్కలను అందులో వేసి ఆరుగంటలపాటు ఊరనివ్వాలి.
 
తరువాత చికెన్ ముక్కల్ని బొగ్గుల సెగమీద దోరగా కాల్చాలి. ఆపై వీటిని ఒక ప్లేటులో పెట్టి చాట్ మసాలా పొడి చల్లి, ఉల్లిపాయ చక్రాలూ నిమ్మ డిప్పలతో అందంగా అలంకరించి అతిథులకు వడ్డించాలి. ఈ చికెన్ కబాబ్‌లను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

అన్నీ చూడండి

ప్రకాశం జిల్లా తీరాన్ని తాకనున్న మురసు తీవ్రతుపాను, ఈ మండలాలు వారు జాగ్రత్త

ఆస్తి కోసం దారుణ హత్య, తమ్ముడి భార్య గొంతుకి పంచెకట్టి ఈడ్చుకెళ్లి చంపిన బావలు

తిరుపతిలో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కాంట్రాక్ట్ ఉద్యోగిని దారుణ హత్య

భయపెడుతున్న మురసు తుఫాను - ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌తో దీపావళి జరుపుకోవచ్చు : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి

Rashmika: రష్మిక మైసా నుంచి మహిళా శక్తిని చాటే పవర్‌ఫుల్ ఆంథమ్‌ ఓ మైసా రే రిలీజ్

Deepika Padukone: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె మూవీ కింగ్ నుంచి పాప్ సాంగ్‌

Rahul Vijay: డార్క్ క్రైమ్ జానర్‌లో అ (AH) చిత్రం రాబోతోంది

కల్ట్, వైల్డ్ డ్రామాగా డానీ చిత్రం ఉంటుంది - ఆశిష్ గాంధీ

తర్వాతి కథనం
Show comments