చికెన్‌తో టేస్టీ వడలు చేయడం ఎలా ?

సోమవారం, 7 జులై 2014 (17:47 IST)
చికెన్ అంటేనే వర్షాకాలంలో వేడివేడిగా తినేయాలి అనిపిస్తుంది. అలాంటి చికెన్‌లో విటమిన్ ఇ, బీటాకారోటీన్, విటమిన్ బి6, బి12, జింక్ వంటి పోషకాలున్నాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వందశాతం ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగివుండే చికెన్‌తో వడలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ : పావు కేజీ 
కోడిగుడ్డు : ఒకటి 
పచ్చిమిర్చి : రెండు 
వెల్లుల్లి ముక్కలు : అరకప్పు 
అల్లం పేస్ట్ : అర టీ స్పూన్ 
వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ 
కొబ్బరి తురుము : ఒకటిన్నర తురుము 
పసుపు పొడి : అర టీ స్పూన్ 
మిరిప్పప్పొడి : అర టీ స్పూన్  
కరివేపాకు : కాస్త 
నూనె : తగినంత 
ఉప్పు : తగినంత 
మీట్ మసాలా : ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం : 
ఒక పాత్రలో పచ్చిమిర్చి, ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను వేసి కలుపుకోవాలి. ఇందులో ఉడికించి కవ్వంతో మెదుపుకున్న చికెన్‌ను చేర్చుకోవాలి. కరివేపాకు తరుగు, కొబ్బరి తురుము, కోడిగుడ్డు, తగినంత ఉప్పు కూడా చేర్చుకోవాలి. గారెలకు తగ్గట్టు సిద్ధం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక గారెల్లా చేసుకున్న పిండిని దోరగా వేపుకోవాలి. గారెలు రెండు వైపు దోరగా వేగాక టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

అన్నీ చూడండి

పులుల సంరక్షణకు మహారాష్ట్ర సహకారం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రన్‌వేపై పేలిన టైరు... తృటిలో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నగరవాసులను పాముల బెడద..

ఒకే రోజు ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఒకే రోజు చూస్తాను.. నారా లోకేష్

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

అన్నీ చూడండి

Adivi Sesh : జూలైలో జి 2 షెడ్యూల్ చాలా ప్రత్యేకమైందంటున్న అడివి శేష్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Show comments