రోటీలకు ఎగ్ కర్రీ సూపర్ కాంబినేషన్!

బుధవారం, 4 జూన్ 2014 (12:30 IST)
రోటీలు చేస్తున్నారా? అయితే టక్కుమని ఎగ్ కర్రీ చేసేయండి. కోడిగుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఎగ్ కర్రీ రిసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం..
 
కావలసిన పదార్థాలు : 
ఉడికించిన కోడిగుడ్లు : ఆరు 
ఉల్లి తరుగు : అర కప్పు, 
టమోటా పేస్ట్ : అర కప్పు
వెల్లుల్లి, అల్లం పేస్ట్ : ఒక టీ స్పూన్ 
పచ్చి మిర్చి : 2 సన్నగా తరిగినవి 
కొత్తిమీర తరుగు : కాసింత 
ఉప్పు : తగినంత 
పసుపు, ధనియాల పొడి, గరం మసాలా: అర స్పూన్ 
నూనె : తగినంత 
వెన్న: ఒక కప్పు
పచ్చి బఠానీలు, పనీర్ చెరో కప్ మీకు ఇష్టమైతే చేర్చుకోవచ్చు.
 
తయారీ ఇలా.. 
ముందుగా కోడిగుడ్లను ఉడికించి పైపొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి. 
 
తర్వాత గరం మసాలా, అల్లం, వెల్లుల్లి ముద్ద, టమోటో గుజ్జు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి కొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.
 
తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకొన్న పనీర్, ఉడికించిన పచ్చిబఠానీ, గుడ్లను వేసి బాగా మిక్స్ చేసి తక్కువ మంటలో 15 నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి రైస్ లేదా రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేయాలి.

అన్నీ చూడండి

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు : కృషి తాపండా

Show comments