బ్రేక్ ఫాస్ట్ రిసిపీ: ఎగ్ పరోటా ఎలా చేయాలి?

మంగళవారం, 6 జనవరి 2015 (16:24 IST)
గుడ్డును రోజుకోకటి ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుడ్డును రోజూ తీసుకుని బోర్ కొట్టేస్తే వెరైటీగా తీసుకోవచ్చు. అలాంటి వెరైటీల్లో ఎగ్ పరోటా కూడా ఒకటి. గుడ్డు అత్యంత ప్రోటీనులు కలిగిన ఓ హెల్తీ ఫుడ్. 
 
ఒక ఎగ్ తో బ్రేక్ ఫాస్ట్‌తో ప్రారంభించినట్లైతే, ఆరోజంతటికీ సరిపడే, ఎనర్జీని పొందగలుగుతారు. కేవలం ఎనర్జీ లెవల్స్ మాత్రమే కాదు గుడ్డు తీసుకోవడం ద్వారా క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అలాంటి హెల్దీ ఎగ్‌తో పరోటా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం...
 
కావల్సిన పదార్థాలు: 
గోధుమ పిండి: మూడు కప్పులు 
గుడ్లు: ఆరు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత 
బటర్ లేదా నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
 
తయారీ విధానం: 
ముందుగా గోధుమపిండిని కొన్ని నీళ్లు చేర్చి కలిపి పెట్టుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత, దానికి పల్చగా తడిగా ఉండే క్లాత్‌ను కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఆ పిండి నుండి బాల్ సైజ్ పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా రోల్ చేసుకోవాలి. 
 
ఇలా వత్తుకొన్న చపాతీ మీద కొద్దిగా నూనె చిలకరించి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి సెమీ సర్కిల్ షేప్‌లో రోల్ ఫోల్డ్ చేసుకోవాలి. తిరిగి మరికొద్దిగా నూనె ఉపయోగించి తవాను వేడి చేసి, చపాతీని పాన్ మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
 
కాలేటప్పుడు, చపాతీ పై పొరలాగా తీసి నిధానంగా దాని మీద గుడ్డు పగులగొట్టి పోయాలి. నూనె చేర్చి ఇరువైపులా దోరగా కాల్చుకుని ఏదైనా చట్నీతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటాయి. 

అన్నీ చూడండి

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా?

అన్నీ చూడండి

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

ఇండస్ట్రీలో చీకటి కోణాలు అనేకం.. మగాడు టచ్‌ చేయగానే ఆడపిల్లకి అర్థమైపోతుంది : సింగర్ సునీత

Show comments