వీక్కెండ్ స్పెషల్: మరాఠీ ప్రాన్ కర్రీ

శనివారం, 3 జనవరి 2015 (16:31 IST)
కావల్సిన పదార్థాలు: 
రొయ్యలు - 8 (పొక్కులు తొలగించి శుభ్రం చేసి పెట్టుకోవాలి.)
వెల్లుల్లి రెబ్బలు - 8 పేస్ట్ చేసుకోవాలి 
అల్లం -  అంగుళం తీసుకు పేస్ట్ చేసుకోవాలి 
పచ్చిమిరపకాయలు - 5 పేస్ట్ చేసుకోవాలి 
కరివేపాకు - రెండు రెమ్మలు
కారం పొడి - ఒక టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్
టమోటో గుజ్జు - రెండు టేబుల్ స్పూన్‌లు
చింతపండు గుజ్జు - ఒక కప్పు 
పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు
కొత్తిమీర - కొద్దిగా తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి 
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు 
ఉప్పు - తగినంత 
 
తయారుచేయండి ఇలా :
మొదట పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొక్కులు తీసి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలకు పట్టించాలి. అలా అర గంట సేపు తర్వాత  పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కరివేపాకు వేసి ఒక నిముషం చిటపటాయించాలి. 
 
తర్వాత మసాలా పేస్టులో బాగా ఊరిన రొయ్యలను నూనెలో వేసి మీడియం మంట మీద ఐదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు బ్రౌన్ కలర్‌లో వేగుతున్నప్పుడు, అందులో టమోటో గుజ్జు వేసి బాగా మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద మరో ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. 
 
ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులో చింతపండు పులుసు పోసుకుని మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా తాజాకొబ్బరి తురుము మరియు కొత్తమీర తురుము వేసి బాగా మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన మరాఠీ ప్రాన్ కర్రీ రెడీ.

అన్నీ చూడండి

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

Show comments