Webdunia - Bharat's app for daily news and videos

Install App

సండే స్పెషల్ నాన్ వెజ్... కోడిగుడ్డుతో ఇలా చేయండి

Written By సిహెచ్
Updated: శనివారం, 28 సెప్టెంబరు 2019 (21:40 IST)
ఆదివారం అనగానే నాన్ వెజ్ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు చాలామంది. ఈసారి కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ చేసి పిల్లలకు పెట్టి చూడండి. లొట్టులు వేసుకుని తింటారు. ఈ వంటకం పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లలకు కోడిగుడ్డును ఇవ్వడం ద్వారా పెరుగుదలకు తగిన పోషకాలు అందుతాయి. అలాంటి కోడిగుడ్డుతో ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు 
కోడిగుడ్లు - 4
ఉల్లి తరుగు - అర కప్పు 
టమోటా తరుగు - అర కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ 
పచ్చి మిర్చి - నాలుగు
కొబ్బరి తురుము - పావు కప్పు 
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్ 
మిరియాలు - ఒక టేబుల్ స్పూన్ 
పసుపు - పావు టీ స్పూన్ 
కారం - రెండు టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - 3 టీ స్పూన్లు 
దాల్చిన చెక్క - 2
ఉప్పు, నూనె - తగినంత  
 
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో నాలుగు కోడిగుడ్లను కొట్టి పోసి అందులో సగం ఉల్లి తరుగు వేయాలి. పసుపు, పచ్చి మిర్చి ఉప్పు చేర్చి బాగా గిలకొట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా పోసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి, జీలకర్ర, మిరియాలు బాగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక దాల్చిన చెక్క, సోపు గింజలు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చి దోరగా వేపుకోవాలి. తర్వాత టమోటా చేర్చాలి. 
 
బాగా వేగాక పసుపు పొడి, మిరిపపొడి, ధనియాల పొడి చేర్చి వేపాలి. కావలసినంత నీరు పోసి కాసేపు తెల్లనివ్వాలి. బాగా తెల్లాక రుబ్బిన కొబ్బరిని చేర్చి కాసేపు తెల్లనివ్వాలి. దించేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను కూరలో చేర్చుకోవాలి. ఈ కూరలో కావాలంటే నిమ్మరసం లేదా ఒక టేబుల్ స్పూన్ చింతపండు జ్యూస్‌ను చేర్చుకోవచ్చు. ఈ గ్రేవీని కొత్తిమీర, కరివేపాకు గార్నిష్‌తో దోసె, రైస్‌కు సైడ్ డిష్ సర్వ్ చేస్తే టేస్ట్ సూపర్‌గా వుంటుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments