శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (17:54 IST)

ఆదివారం మాంసాహారం... రొయ్యలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆదివారం రాగానే మాంసాహారం తింటుంటారు చాలామంది. ఐతే ఎప్పుడూ ఒకే రకమైన నాన్ వెజ్ తీసుకోకుండా డిఫరెంటుగా సీ ఫుడ్ తీసుకోవాలి. రొయ్యలు చిన్నవైనా బలవర్థకమైనవి. రుచికరమే గాక, ఆరోగ్యాన్నిచ్చేవి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్లు రొయ్యల ద్వారా పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాల్షియం పాస్ఫరస్, ఐరన్, ఐయోడిన్, విటమిన్ బీ2, నికోటినిక్ ఆసిడ్‌లు రొయ్యల్లో ఉన్నాయి. రొయ్యలు తేలికగా జీర్ణమవుతాయి. రొయ్యల్లో 50.0-70.0 శాతం తేమ, ప్రోటిన్లు 67.5-80.1శాతం, క్యాల్షియం 470-535 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 715.0-930.0, ఐరన్ 27.6-43.1లు ఉన్నాయి. 
 
రొయ్యలలో కనిపించే ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక విటమిన్స్ ఎముకలకు బలాన్నిస్తాయి. మీ రోజువారీ లేదా వారపు ఆహారంలో రొయ్యల్ని కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయని, కీళ్లు, మోకాళ్ల నొప్పులను అడ్డుకోవచ్చని న్యూట్రీషన్లు అంటున్నారు.