మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (21:02 IST)

పురుషులు వీటిని తింటే ఆ శక్తి రెట్టింపు.... అందుకే రోజూ...

యాలుకలకు ప్రత్యేక స్థానం ఉంది. వంటకాలకు అదనపు సువాసన ఇవ్వడంతో పాటు ఔరా అనిపించే ఆరోగ్య ప్రయోజనాలు యాలుకలకు ఉన్నాయి. ఇందులో విటమిన్స్‌తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. నోటి దుర్వాసన లాంటి సాధారణ సమస్యలతో పాటు, గుండెపోటు లాంటి అసాధారణ సమస్యలను నివారించడంలో యాలుకలు కీలకపాత్ర వహిస్తాయి.
 
1. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలుకను తిని ఒక గ్లాసు వేడినీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువు, చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని హానికరమైన మలినాలు, వ్యర్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యను నివారిస్తుంది. మలబద్దక సమస్య నుండి విముక్తి పొందుతారు. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్రలో వచ్చే గురకను తగ్గిస్తుంది.
 
2. యాలుకలు శృంగార జీవితంలో ఏర్పడే అపశృతులను తొలగిస్తాయి. లైంగిక సమస్యలను దూరం చేస్తాయి. పడక గదిలో ఏర్పడే వత్తిడులను తగ్గించి మంచి మూడ్‌ను యాలుకలు తీసుకువస్తాయి. అంతేకాకుండా వీర్యంలో శుక్రకణాల వృద్ధికి తోడ్పడుతాయి. శృంగార జీవితానికి యాలుకలు ఒక శక్తివంతమైన టానిక్ అని చెప్పవచ్చు.
 
3. శీఘ్ర స్ఖలనం, నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలకు అద్భుతంగా పని చేస్తుంది. సంభోగంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేస్తాయి. అందువల్ల రోజూ యాలుకలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శృంగార పరమైన సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
4. చర్మసౌందర్యానికి కూడా యాలుకలు ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలను తగ్గించి వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టు పెరిగేలా దోహదపడుతుంది. ఇలా అనేక ప్రయోజనాలను కలిగిన యాలుకలను ఆహారంలో తీసుకుంటే మేలు కలుగుతుంది.