మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 13 జూన్ 2019 (21:46 IST)

కొబ్బరినీళ్లేగా అని తీసిపారేయవద్దు... కూల్ డ్రింక్స్ కంటే...

వేసవి కాలంలో ఎక్కువమంది తాగే పానీయం కూల్ డ్రింక్స్. ఇలాంటి వాటి కంటే కొబ్బరి నీరు ఎంతో శ్రేష్టకరమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేయడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. వేడిని, దాహాన్ని తగ్గించే కొబ్బరి బొండాంలో సహజ ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలెస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. 
 
ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు త్రాగడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. ఒక కొబ్బరి బోండాంలోని నీరు ఒక సెలైన్‌ వాటర్‌ బాటిల్‌తో సమానమని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాంటి కొబ్బరి నీటిలో 24 కేలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా లేత కొబ్బరి బోండాల్లో 90 నుంచి 95 శాతం నీరు ఉంటుందని, వేసవి కాలంలో ఈ నీటిని తాగడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు సలహా ఇస్తున్నారు. వేసవిలో కళ్లు మంట, వడదెబ్బ వంటివి రాకుండా వుండాలంటే కొబ్బరి నీళ్లు తాగడమే మంచిది.