మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 11 జూన్ 2019 (21:04 IST)

మగవారు ఎరుపు అరటి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

అరటి పండ్లలో రకరకాలుంటాయి. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు అరటిపండ్లు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే కంటిచూపుకు ఎరుపు రంగుల అరటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. దృష్టి లోపాలకు ఈ పండు చెక్ పెడుతుంది. 
 
అలాగే కంటి దృష్టి సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక అరటిపండును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి భోజనానికి తర్వాత 48 రోజుల పాటు ఎరుపు అరటిని తీసుకుంటే నరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
ముఖ్యంగా ఆడవారు కనీసం రోజుకు రెండు అరటిపళ్ళు తినడం వల్ల కేన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాక గర్భాశయంలో ఏర్పడే కొలొరెక్టల్‌ కాన్సర్‌ని అరికడుతుంది. అరటిపండు జ్యూస్‌ సేవించడం వల్ల అధిక రక్తపోటు తగ్గడమే కాక, కిడ్నీలో ఏర్పడే రాళ్ళని కరిగిస్తుంది.