శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 12 జూన్ 2019 (10:53 IST)

కనీసం ఒక్క డ్రై ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి... ఎందుకంటే?

డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలిసి ఉండదు. మరీ ముఖ్యంగా ఇవి మంచి సౌందర్య సాధనాలన్న విషయం తెలిసిన వారు చాలా అరుదు. అలాగే, ఇపుడు వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 
 
అవిరాకుండా ముందే జాగ్రత్త పడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే రోజుకు ఒక్క డ్రై ఫ్రూట్ అయినా ఆరగించాలని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.
 
* రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
* శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
* కంటిచూపు మెరుగుపడుతుంది.
* కేన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నశిస్తాయి.
* జుట్టు పెరుగుతుంది. జుట్టు దృఢంగా తయారవుతుంది.
* శరీరానికి తక్షణ శక్తనిస్తుంది.
* జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం వంటి సమస్యలు పోతాయి.