శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2019 (16:31 IST)

ఈ మిరియాలు వున్నాయ్ చూశారు గురూ.. పొడి రూపంలో తీసుకుంటేనా?

మిరియాలను వంటకాలలో తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు.
 
1. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.
 
2. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని వైద్యులు తెలిపారు.
 
3. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు వైద్యులు. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.
 
4. శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి పెద్ద చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకోవచ్చు. 
 
5. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. 
 
6. ముఖ్యంగా ఈ మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా ఉపయోగపడుతాయని అంటున్నారు వైద్యులు.