వీకెండ్ స్పెషల్: మటన్ కడాయ్ రిసిపీ!

శనివారం, 24 జనవరి 2015 (17:41 IST)
నాన్ వెజ్ తీసుకోవాలంటే.. మటన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రేవీలు, రోస్ట్‌లే కాకుండా మటన్‌తో కడై మటన్ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో ఈ వారం ట్రై చేద్దాం.
 
కావల్సిన పదార్థాలు: 
మటన్: అరకేజీ 
టమోటో తరుగు : ఒక కప్పు 
ఉల్లిపాయ :  నాలుగు 
పచ్చిమిర్చి పేస్ట్ :  రెండు స్పూన్లు
పెరుగు: అరకప్పు
గరం మసాలా : రెండు టీ స్పూన్లు 
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: ఒక టీ స్పూన్ 
కారం: రెండు టీ స్పూన్లు
ధనియాల పొడి: ఒక టీ స్పూన్ 
బిర్యానీ ఆకు: ఒక టీ స్పూన్ 
నూనె: 3 టేబుల్ స్పూన్లు 
అల్లం పేస్ట్: ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్ 
జీలకర్ర: ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం: 
ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ముక్కల్లో ఉప్పు, పెరుగుతో మ్యారినేట్ చేసి అరగంట పాటు పక్కనపెట్టేయాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
 
తర్వాత అదే పాన్‌లో మటన్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అదే నూనెలో కొద్దిగా నూనె పోసి జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
 
ఉల్లి పేస్ట్ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2-3నిముషాలు వేగించుకోవాలి. టమోటో, ధనియాలపొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మరో 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో మ్యారినేట్ చేసుకొన్న మటన్‌ను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. 15-20 నిముషాలు మీడియం మంట మీద మటన్ పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ఫ్రై చేసుకొన్న పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసి దించేస్తే మటన్ కడై రిసిపీ రెడీ.

అన్నీ చూడండి

వచ్చే జన్మలో మళ్లీ నీ కడుపులోనే పుట్టి, నీకు ఇలాంటి బాధను కలిగించను

కేతన్ హత్య : సోదరి నిలదీతతో హత్యగా మారిన సెల్ఫీ ప్రమాద కేసు

తప్పిపోయిన తుని పాప సెప్టెంబరు లోపు తిరిగి వస్తుందని జ్యోతిష్యుడు జోస్యం

కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు స్థానాలు

పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం

అన్నీ చూడండి

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

ఇండస్ట్రీలో చీకటి కోణాలు అనేకం.. మగాడు టచ్‌ చేయగానే ఆడపిల్లకి అర్థమైపోతుంది : సింగర్ సునీత

Balakrishna: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతుతో అమరావతిలో చిత్ర పరిశ్రమకు కట్టుబడి ఉన్నాం

Sukumar: ఇడుపు కాయితం తెలంగాణ నేపథ్యమైనా గ్లోబల్ స్థాయి సినిమా.: ప్రియదర్శి

Nithiin: ఇట్స్ లైఫ్ బ్రో” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నితిన్‌

Show comments