సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (06:17 IST)

నేటి దినఫలాలు : అప్రమత్తంగా మెలగాలి..

మేషం : వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమపడవలసి వస్తుంది.కోర్టు వ్యవహా

మేషం : వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమపడవలసి వస్తుంది.కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి.
 
వృషభం : ఆర్థికంగా బాగన్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. సోదరీ, సోదరుల మధ్య తగాదాలు రావొచ్చు. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మిథునం : కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అపార్ధాలు మాని ఇతరులను అర్థం చేసుకోండి. ఎల్.ఐ.సీ, పోస్టల్, ఇళ్ల స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దంపతుల మధ్య అపార్థాలు తలెత్తుతాయి.
 
సింహం : ఆర్థిక లావాదేవీలు సాఫీగా జరుగుతాయి. భావోద్వేగాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి. చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలం. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తొలగిపోతాయి.
 
కన్య : ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. ఇతరులకు మేలు చేసినా అపవాదులపాలవుతారు. మీకున్న కళా నైపుణ్యతలను ఇతరులు మెచ్చుకునేలా చక్కగా ప్రదర్శిస్తారు. స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, వస్త్ర లాభం, వాహన యోగం వంటి శుభ ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
తుల : రాజకీయనాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రత్యర్ధులు మిత్రులుగా మారతారు. నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ధనం ఓ కొంతైనా పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు.
 
వృశ్చికం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాంట్రాక్టులు చివరిలో దక్కుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు.
 
ధనస్సు : ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు సంభవిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో దాయాదులతో జాగ్రత్తగా వ్యవహరించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.
 
మకరం : రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. క్రమంగా అన్నివిధాల చురుగ్గానూ, ఉత్సాహంగానూ జరుగుతాయి. ఉద్యోగస్తులు, ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్వయంకృషితో రాణిస్తారు.
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు వాయిదా పడుట మంచిదని గమనించండి.
 
మీనం : మీ ఆలోచనా దృష్టిని మరికాస్త పెంపొందించుకోండి. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందుకు వెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. బ్యాంకు ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. తినుబండ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. చిన్న తరహాపరిశ్రమలలో వారికి అనుకూలత.