బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (13:16 IST)

శుక్రవారం మంగళసూత్రాన్ని మార్చడం చేస్తున్నారా? (video)

Mangalsutra
సుమంగళీ మహిళలకు కట్టుబొట్టు చాలా ముఖ్యం. ముఖ్యంగా మంగళసూత్రం అనేది వివాహిత జీవితంలో ఎంతో ముఖ్యం. సాధారణంగా మంగళసూత్రాన్ని కొందరు మహిళలు పసుపు తాడుగానూ.. కొందరు బంగారంతో పసుపు తాడును కలిపి ధరిస్తున్నారు.

అయితే పసుపు దారాన్ని మంగళసూత్రంగా ధరించినా.. బంగారంతో కలిపిన పసుపు దారంతో మాంగల్యాన్ని ధరించినా.. సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే దాన్ని మార్చాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలా మంగళసూత్రంలోని పసుపు దారాన్ని మార్చాలనుకుంటే.. సోమవారం, బుధ, గురువారాల్లో మాత్రమే చేయాలి. కొందరు శుక్రవారాల్లో మంగళసూత్రాన్ని మార్చడం చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. మంగళసూత్రాన్ని శుక్రవారం పూట లేదా మంగళవారం, శనివారాల్లో మార్చడం చేయకూడదు. మంగళసూత్రం లక్ష్మీప్రదం కావున.. శుక్రవారం పూట దానిని మార్చడం అస్సలు చేయకూడదు. 
 
అలాగే మంగళసూత్రాన్ని మార్చేటప్పుడు ఎవ్వరి కంట పడేట్లు చేయకూడదు. మంగళసూత్రాన్ని సూర్యోదయానికి  ముందు బ్రహ్మ ముహూర్త కాలంలో మార్చడం ఉత్తమం. అలాగే మంగళసూత్రానికి రోజూ పసుపు రాయడం చేస్తుండాలి. అలాగే గర్భిణీ మహిళలు ప్రసవానంతరం మాత్రమే మంగళసూత్రాన్ని మార్చడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
ఇంకా రాహుకాలం, యమగండాల్లో మంగళసూత్రాన్ని మార్చడం చేయకూడదు. ఇంకా మంగళసూత్రాన్ని మార్చేందుకు కూర్చుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో లేవకూడదు. మహిళలు నెలసరి సమయాల్లో మంగళసూత్రాన్ని మార్చడం కూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.