Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి ఫలితాలు 16-06-17 : ప్రియమైన వ్యక్తులతో ఉల్లాసంగా...

మేషం: వృత్తి, ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. రావలసిన పత్రాలు, రశీదులు అందకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షే

Written By raman
Updated: గురువారం, 15 జూన్ 2017 (22:36 IST)
మేషం:
వృత్తి, ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. రావలసిన పత్రాలు, రశీదులు అందకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
వృషభం
ఆర్థిక స్థితి మారుతుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. మీ శ్రీమతి మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రియమైన వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. రుణాలు తీస్తారు. కొత్త రంగాలలో ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
మిథునం 
వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. నూతన దంపతులు పరస్పరం మరింత చేరువవుతారు. అహగాహనలేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ముక్కుసూటిగాపోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. 
 
కర్కాటకం
కుటుంబీకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది. రాజకీయాలలో వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. 
 
సింహం
స్త్రీలకు తల, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. పనులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలకైన వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
కన్య
ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోతాయి. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. 
 
తల 
ఖర్చులు పెరిగినా ఆర్థికంగా మెరుగైన స్థితిలోనే ఉంటారు. పాత మిత్రుల కలయికతో మీలో మార్పు వస్తుంది. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సంతానం విద్యావిషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసివస్తాయి. 
 
వృశ్చికం
వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలించదు, సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు బంధువులతో సత్సంబధాలు నెలకొంటాయి. 
 
ధనస్సు 
ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారాలు, సంస్థల అభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగుజాగ్రత్తలు అవసరం. చిన్నపాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
మకరం 
సామర్థ్యం, అంకితభావం ప్రదర్శించి అన్ని రంగాల వారిని ఆకట్టుకుంటారు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. హోటల్, తినుబండర వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. 
 
కుంభం 
బంధువుల రాకతో స్త్రీలు కొంత అసౌకర్యానికి లోనవుతారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. ఏసీ కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి, పురోభివృద్ధి, కానవస్తుంది. 
 
మీనం
ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఏకాగ్రత చాలా అవసరం. మత్స్యు కోళ్ల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. గృహంలో స్వల్ప మార్పులు చేపడుతారు. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.

అన్నీ చూడండి

ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేస్తే 2 నిమిషాల్లో ఆమోదిస్తా: సీఎం డికె శివకుమార్ భారీ షాక్

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

అన్నీ చూడండి

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి అమెరికా ప్రవచనం ముఖ్యాంశం

04-08-2026 మంగళవారం ఫలితాలు.. మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు..

03-08-2026 సోమవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

తర్వాతి కథనం
Show comments