Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

శుక్రవారం (23-02-2018) మీ దినఫలాలు : గిట్టనివారికి హితవు చెప్పి...

మేషం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. దంపతుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. గిట్టనివారికి హితవు చెప్పి భంగప

Written By raman
Updated: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (08:25 IST)
మేషం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. దంపతుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. గిట్టనివారికి హితవు చెప్పి భంగపాటుకు గురవుతారు. ప్రముఖులతో పరిచయాలు, తరచు విందులు వంటి శుభ సంకేతాలున్నాయి. 
 
వృషభం: బ్యాంక్ వ్యవహారాల్లో చికాకులు తప్పవు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల చికాకులు తప్పవు. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. 
 
మిథునం: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులపట్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో మెళకువ అవసరం. 
 
కర్కాటకం: మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
సింహం : కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. విద్యార్థులకు ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు తల, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. 
 
కన్య: స్త్రీల సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి, పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం నుంచి వ్యతిరేకత, సమన్వయ లోపం ఎదుర్కొనవలసి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
తుల: ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో వస్తువులు పోయే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. అనుక్షణం భాగస్వామికుల తీరును గమనించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
ధనస్సు: స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. 
 
మకరం: కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. రుణయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. ప్రముఖుల కలయిక వల్ల నూతన పరిచయాలేర్పడతాయి. 
 
కుంభం: రాజకీయాల్లోని వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల సలహా పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. 
 
మీనం : ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సివస్తుంది. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత వంటి చికాకులు తప్పవు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments