ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (09:24 IST)

04-04-2019 గురువారం దినఫలాలు - కన్యరాశివారు అలా చేయడం వల్ల...

మేషం: పత్రికా రంగంలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఆలయాలను సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
వృషభం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ చాలా అవసరం. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
మిధునం: ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకుంటారు. మీడియా రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆకస్మికంగా దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం: ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. దూరప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్పెక్యులేషన్ లాభదాయకం. కొబ్బరి, పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారం ఉంది.
 
సింహం: వృత్తి వ్యాపారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచండి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, సహనం ఎంతో అవసరం. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కన్య: తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. దైవ దీక్షలు, మొక్కుబడులకు అనుకూలం. నూతన వ్యాపారాల పట్ల మెళకువ వహించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. 
 
తుల: ఆర్థిక, కుటుంబ సమస్యలు చక్కబడుతాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలం. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. అసాధ్య మనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది.
 
వృశ్చికం: ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, మెడికల్ క్లయింట్లు వాయిదా పడుతాయి. కుటుంబీకులతో శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. 
 
ధనస్సు: కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. 
 
మకరం: ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ప్రతి విషయంలోను సంయమనం పాటించడం మంచిది. నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. 
 
కుంభం: కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఒక అవగాహనకు వస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. నూతన దంపతులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు, అధికారులకు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
మీనం: సన్నిహితులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసివస్తుంది. రుణ, విదేశీయాన యత్నాలు ఏమాత్రం ముందుకు సాగవు. ఒక వ్యవహారం నిమిత్తం అనేక సార్లు తిరగలసివస్తుంది. కళారంగాల్లో వారికి పురోభివృద్ధి.