శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (20:49 IST)

07-10-2019- సోమవారం మీ రాశి ఫలితాలు.. మీ ఏమరుపాటుతనం వల్ల?

మేషం: మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కీలకమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు.
 
వృషభం: శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోకపోవటం అన్నివిధాల మంచిదని గమనించండి.
 
మిధునం: పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పనులు వాయిదా వేసుకుంటారు. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. ఖర్చులు మీ అంచనాలు మించటంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. సన్నిహితుల వ్యాఖ్యానాలు ఇబ్బంది కలిగిస్తాయి. 
 
కర్కాటకం: స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు సంతృప్తి కానవస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. విద్యార్థలు బహుమతులు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
 
సింహం: ఆర్థికంగా కలిసిరావటం వల్ల మరింత సంతోషంగా గడుపుతారు. దంపతుల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. బంధువుల రాకపోకలు సంతోషాన్ని కలిగిస్తాయి. వాహనం నడుపునపుడు మెలకువ వహించండి. 
 
కన్య: ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ఫైనాన్సు, చిట్‌‌ఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తి కానరాగలదు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. విద్యుత్ రంగంలోవారు మాటపడకతప్పదు.
 
తుల: విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు.
 
వృశ్చికం: రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయండి. మీ విరోధులు వేసే పథకాలు త్రిప్పిగొట్ట గలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
 
ధనస్సు: ఓర్పు, అంకితభావం ఎంతో అవసరం. కుటింబీకులతో సరదాగా గడుపుతారు. మధ్య మధ్య ఔషద సేవ తప్పదు. రాజకీయాలలో వారికి మెళుకవ అవసరం. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలను పొందగలుగుతారు. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. దైవ పుణ్యకార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
మకరం: గతస్మృతులు జ్ఞప్తికి రాగలవు. విద్యార్థులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. అతిధిసతార్రం బాగుగా నిర్వహిస్తారు. పాత వస్తువులను కొనడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. ప్రియతముల కోసం, సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
కుంభం: సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యుత్ రంగంలోవారు మాటపడక తప్పదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమయినదని గమనించండి.
 
మీనం: కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. గృహోపకరణాలు, విలాస వస్తువులు అమర్చుకుంటారు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి.