శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (08:58 IST)

03-10-2019- గురువారం దినఫలాలు - వ్యాపారాలలో కష్టనష్టాలు...

మేషం: ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. అనుకున్న పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం: భాగస్వామిక వ్యాపారాలలో కష్టనష్టాలు ఎదుర్కొవలసి వస్తుంది. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. వస్త్రాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. ముందు చూపుతో వ్యవహరించండి. వాహన సౌఖ్యం పొందుతారు.
 
మిధునం: దైవ కార్యాలో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. పన్నులు, వడ్డీలు, పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలు లభిస్తాయి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. గృహారంభ, ప్రవేశాలు, విహాది శుభకార్యాలలో పాల్గొంటారు.
 
కర్కాటకం: మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు అనువైన సమయం. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావచ్చు. 
 
సింహం: విద్యార్థులు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఆడిటర్లకు, అకౌంట్స్‌‌రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.
 
కన్య: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పత్రిక, ప్రవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసలుబాటు ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
తుల: చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. హోటల్, క్యాటరింగ్ పనివారలకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. గృహోపకరణాలు చేస్తారు. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధకమవుతాయి. 
 
వృశ్చికం: ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు.
 
ధనస్సు: ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది.
 
మకరం: ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పాత రుణాలు తీరుస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి.
 
కుంభం: కోర్టు వ్యవహారాలు, ఆస్తితగాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. ఓ కొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటంతో సంతృప్తిని పొందుతారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
మీనం: దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి వున్న పనులు పునః ప్రారంభమవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు.