సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (08:31 IST)

01-10-2019- మంగళవారం మీ రాశిఫలాలు ... ఉద్యోగ రీత్యా ఆకస్మిక...

మేషం: వృత్తిపరంగా ప్రజా సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు పై చదువుల కోసం చేసేయత్నంలో సఫలీకృతులవుతారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన వాయిదా వేసుకోవటం శ్రేయస్కరం. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
వృషభం: ఉద్యోగస్తులు సమర్థత, సమయపాలనను అధికారులు గుర్తిస్తారు. మిమ్ములను పొగిడే వారి ఆంతర్యం గ్రహించండి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెలిస్తారు. విద్యార్థులు బయటి చిరుతిళ్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీ సమర్థతపై నమ్మకం సడలుతుంది. బంధువులను కలుసుకుంటారు.
 
మిధునం: రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా దృష్టి సారిస్తారు. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి చికాకులు తప్పవు. మీ పై సెంటిమెంట్లు, గత అనుభవాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. వ్యాపారాల్లో నష్టాలను నిదానంగా పూడ్చుకోల్గుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
కర్కాటకం: ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందిని కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవటం ఉత్తమం. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ధనం ఎంత వస్తున్నా నిల్వ చేయలేకపోతారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
సింహం: వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ప్రతికూలతలను దీటుగా ఎదుర్కుంటారు. సమయానికి కావలసిన పత్రాలు, వస్తువులు కనిపించక ఇబ్బంది పడతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. పాత రుణాలు తీరుస్తారు.
 
కన్య: వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభివించలేకపోతారు.
 
తుల: ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు. స్త్రీలు టి. వి. ఛానల్స్ కార్యక్రమాలలో చికాకులు అధికం. నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తి చేసుకుంటారు. ఖర్చులు అధికం.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల జోక్యంతో మీ సమస్యలు పరిష్కారం కాగలవు. ఇటుక, సింమెంట్, కలప, ఐరన్, ఇసుక వ్యాపారులకు కలిసివచ్చేకాలం. ఎల్. ఐ. సి, బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్లకు సంబంధించిన సొమ్ము చేతికందుతుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
ధనస్సు: వృత్తుల వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. రవాణా కార్యక్రమాల్లో చురుకుదనం కానవస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలెదురైనా సమయానికి పూర్తి కాగలవు. ఉద్యోగస్తులకు బోనస్, పండుగ అడ్వాన్స్‌‌‌‌లు మంజూరు కాగలవు.
 
మకరం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికం. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకవ అవసరం. చిన్ననాటి మిత్రులు అనుకోకుండా తారసపడతారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికంగా ఉంటాయి. 
 
కుంభం: బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి కొంత అనుభవం గడిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరం. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులను మెప్పిస్తారు. రాజకీయాల వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారని గమనించండి.
 
మీనం: రుణాల కోసం అన్వేషిస్తారు. పెద్దలతో సంభాషించునపుడు మెళుకవ అవసరం. అతిథి మర్యాదలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థునులకు క్యాంపస్ సెలక్షన్‌‌లో నిరుత్సాహం తప్పదు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.