మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (08:54 IST)

11-03-2019 సోమవారం దినఫలాలు - ఆ రాశివారికి ఆర్థిక ప్రగతితో కూడిన...

మేషం: ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సంబంధాలు బలపడుతాయి. సందర్భం లేకుండా నవ్వడం వలన కలహాలు ఎదుర్కోవలసివస్తుంది. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమం కాదు. బాకీలు, ఇంటి అద్దెల వసూలలో సంయమనం పాటించండి. పత్రికా, వార్తా, సంస్థలలోని వారికి ఏకాగ్రత, మెళకువ అవసరం.
 
వృషభం: ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలతో మోసపోయే వీలుంది. విలువైన వస్తువులను పోగొట్టుకున్న వారికి అందించి మీ నిజాయితీని చాటుకుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం.
 
మిధునం: పెద్దల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ధన వ్యయం, చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. రవాణా రంగాల వారికి మెళకువ, ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. సన్నిహితులతో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు మార్పు కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
సింహం: రాజకీయాల్లో వారికి కార్యకర్తల వలన సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుట మంచిది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల కారణంగా పై అధికారులతో మాటపడతారు. లిటిగేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
కన్య: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించడం మంచిది. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. ప్రేమికులకు పెద్దల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
తుల: పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వైద్యులకు మెళకువ ఏకాగ్రత చాలా అవసరం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు అధికమవుతాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకువస్తాయి. సభలు, సమావేశాల్లో మంచి గుర్తింపు పొందుతారు. 
 
వృశ్చికం: నిర్మాణ పనుల్లో వేగం కనబడుతుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు క్షేమదాయకం కాదు. మీ శ్రీమతితో అకారణ కలహం, పట్టింపులు ఎదుర్కుంటారు. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
 
ధనస్సు: దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. రాబడికి మించి ఆర్థిక విషయాల పట్ల దృష్టి సాగిస్తారు. విద్యార్థినులకు తోటివారి కారణంగా ఇబ్బందులు తప్పవు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడుతాయి. 
 
మకరం: మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. విదేశాలలోని వారికి వస్తు సామాగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
కుంభం: నూనె, మిర్చి, కంది స్టాకిస్టు వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు. 
 
మీనం: స్త్రీలకు సంపాదనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకోని విధంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ ఉన్నతి చాటు కోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.