ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

14-01-2020 మంగళవారం మీ రాశి ఫలితాలు.. తమలపాకులతో ఆంజనేయ స్వామిని?

తమలపాకులతో ఆంజనేయ స్వామిని ఆరాధించినట్లైతే శుభం కలుగుతుంది.  
 
మేషం: కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విపరీతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులకు సామాన్యం. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు గుర్తింపు లభిస్తుంది. 
 
వృషభం : ఉన్నతస్థాయి ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వుంటుంది. ప్రేమికుల మధ్య భిన్నాభిప్రాయాలు చోటుచేసుకుంటాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం.
 
మిథునం: వైద్యరంగాల వారు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణాలు, నూతన ప్రదేశ సందర్శనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు.
 
కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. అతి కష్టం మీద మీకు కావలసిన సమాచారం లభిస్తుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయంలోను ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ జీవిత భాగస్వామి పట్ల సంయమనం పాటించండి. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది.
 
సింహం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆశించిన ధనం సమయానికి అందకపోవడంతో ఒడిదుడుకులు తప్పవు. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వృత్తుల వారికి మిశ్రమ ఫలితం.
 
కన్య: కిరాణా, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. నిర్మాణ పనులు, గృహ మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. సిమెంట్ వ్యాపారులకు ఆశాజనకం. భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ ప్రత్యర్థుల విషయంలో అనుక్షణం అప్రమత్తత అవసరం. నూతన కాంట్రాక్టులు చేపడతారు.
 
తుల: ఇటుక, ఇసుక, కలప వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి వుండదు. చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు లభించిన తాత్కాలిక అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం: మీ రాక మిత్రులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. వాయిదా వేసిన పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత అవసరం. ఆత్మీయులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
ధనస్సు: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఒత వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వుంటుంది. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. గృహ మరమ్మత్తులు, నిర్మాణాలు ఆశించినంత వేగంగా సాగవు. 
 
మకరం: బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. పత్రికా రంగంలోని వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కుంభం: దైవ, సేవా కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. రవాణా వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మీనం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ రంగానికి అవసరమైన వస్తువులు రవాణా చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు చికాకు పరుస్తాయి. స్త్రీలలో ఒత్తిడి, హడావుడి అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.