Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం (14-07-18) దినఫలాలు - దంపతుల మధ్య కలహాలు...

మేషం : వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సజ

Written By raman
Updated: శనివారం, 14 జులై 2018 (08:42 IST)
మేషం : వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సజావుగా సాగుతాయి. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి.
 
వృషభం : విద్యా సంస్థల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు చీటికి, మాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మిథునం : కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వకార్యాల్లో మీ పనులు సానుకూలిస్తాయి. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. ఉపాధ్యాయులకు రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కర్కాటకం : ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసివ బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. చేపట్టిన పనిలో ప్రతిబంధకాలు ఎదురైన పట్టుదలతో పూర్తిచేస్తారు. మీ ప్రత్యర్ధులను తక్కువగా అంచనా వేయటం వల్ల భంగపాటు తప్పదు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణ వ్యాపారులకు ఆశాజనకం. ప్రలోభాలకు లొంగవద్దు.
 
సింహం : ఉద్యోగస్తులు ఓర్పు, కార్యదీక్షతో పనిచేయవలసి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది.
 
కన్య : బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో అనుకూలం. ఖాదీ, నూలు, చేనేత, కళంకారీ వస్త్ర వ్యాపారులకు మిశ్రమ ఫలితం. కీలకమైన వ్యవహారాలలో పెద్దల సలహా పాటించండి. స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల : మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేయటం మంచిదికాదని గమనించండి. స్త్రీలు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. పుణ్యకార్యాల్లో నిమగ్నులవుతారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. రుణ విముక్తులు కావండంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు అధికం అవుతున్నారని గమనించండి. ప్రైవేట్ సంస్థల్లో వారు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది.
 
ధనస్సు : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు, చిరువృత్తుల వారికి సామాన్యం. ఒకానొక సమయంలో చేతిలో ధనం లేక బాగా అవస్థపడతారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు అదనపు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం : కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ రంగాల వారికి ఆందోళన తప్పదు. సన్నిహితుల సహకారం వల్ల మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి.
 
కుంభం : ఐరన్, ఆటోమోబైల్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మీ వాగ్ధాటి, సమయస్ఫూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల ఓ కంట కనిపెట్టడం మంచిది. సర్దుబాటు ధోరణితో మెలిగిన గాని ఇంట మనశ్శాంతి ఉండదు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
మీనం : కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు, వృత్తుల వారికి కలిసిరాగలదు. ధనం పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. అతి కష్టం మీద అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకుంటాయి.    

అన్నీ చూడండి

సెయూటాకు వలసదారులు.. తొక్కిసలాట 67మంది మృతి.. ఈదుకుంటూ వచ్చేస్తున్నారు..

సోదరీమణులారా... నా గుండెను కదిలించారమ్మా: సీఎం చంద్రబాబు వీడియో షేర్

Chandrababu Naidu పవర్‌ఫుల్ స్పీచ్, మోడీజీతోనే ప్రపంచంలో భారత్ నెం.1, Video

కేరళలో కుమ్మేస్తున్న వర్షాలు.. ఐదుగురు మృతి.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తిరుమలలో చైన్ స్నాచర్.. మహిళా భక్తురాలు బంగారు గొలుసును లాక్కెళ్లాడు..

అన్నీ చూడండి

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...

తర్వాతి కథనం
Show comments