బుధవారం (20-11-2019) దినఫలాలు - హామీలు - మధ్యవర్తిత్వాలు...

బుధవారం, 20 నవంబరు 2019 (07:30 IST)
మేషం: ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా వుండాలి. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇరకాటానికి గురిచేస్తాయి. గత తప్పిదాలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త వహించండి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికం. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
వృషభం: గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా వుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఆటంకాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి.
 
మిథునం: ప్రేమికుల వ్యవహారం సమస్యాత్మకమవుతుంది. మీ మాటే నెగ్గాలనే పంతం మంచిది కాదు. రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వాయిదాలకు చికాకు కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల నుంచి విముక్తి, ప్రశాంతత లభిస్తాయి.
 
కర్కాటకం: వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. అధికారులకు మీపై గురి కుదురుతుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
సింహం: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం వుండదు. హోల్‌‍సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
 
కన్య : రాజకీయనాయకులు సభా సమావేశాల్లో  పాల్గొంటారు. ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
తుల: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలు లాభదాయకంగా వుండగలదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. మందులు, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.
 
వృశ్చికం: భాగస్వామిక విషయాల్లో మీదే పైచేయి. బిల్డర్లకు పనివారలతో చికాకులు అధికం. వైద్యులకు శస్త్రచికిత్సలతో ఏకాగ్రత అవసరం. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావడంతో ఇబ్బందులు తలెత్తవు. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
ధనస్సు: స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వాదోపవాదాలకు, భేషజాలకు దూరంగా వుండటం మంచిది. ఏ విషయంలోను ఇతరులను అతిగా విశ్వసించడం మంచిది కాదు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి.
 
మకరం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆపత్సమయంలో ఒకరిని ఆదుకోవడం వల్ల ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఓర్పు, లౌక్యం అవసరం.
 
కుంభం: వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. అప్పుడప్పుడు ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రైవేట్ సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
మీనం: ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలేర్పడతాయి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడర్లు గుమాస్తాలకు ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. 

అన్నీ చూడండి

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

అన్నీ చూడండి

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments