మంగళవారం (21-08-2018) దినఫలాలు - నిరుద్యోగులకు ఉద్యోగ..

మేషం: కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. కందులు, ఎండుమిర్చి, స్టాకిస్టులు, వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒక సమాచ

మంగళవారం, 21 ఆగస్టు 2018 (08:49 IST)
మేషం: కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. కందులు, ఎండుమిర్చి, స్టాకిస్టులు, వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. రవాణా రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.
 
వృషభం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.  
 
మిధునం: వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతొ కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఇతరులకు పెద్ద మెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కర్కాటకం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి, పండ్ల, స్వీట్ వ్యాపారాలు జోరుగు సాగుతాయి. కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి, విశ్రాంతి లభిస్తుంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత  మెరుగనిపిస్తుంది. 
 
సింహం: ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. రాజకీయాల్లో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఆంక్షలు వంటివి తప్పవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ఋణం తీర్చడానికై చేయు యత్నాలు ఫలిస్తాయి.  
 
కన్య: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి మినహా ఆశించిన ఫలితం ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పమవుతుంది. 
 
తుల: వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు శుభదాయకం. ప్రయాణాలలో ఊహించని చికాకులు, అసౌకర్యానికి గురికాక తప్పదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
వృశ్చికం: రియల్ ఎస్టేల్ రంగాలవారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. బంధువులను కలుసుకుంటారు. ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు, భాగస్తులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.  
 
ధనస్సు: విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారుయ వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం.
 
మకరం: నగదు చెల్లింపులు, స్వీకరణలో జాగ్రత్త. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. ఆకర్షణీయమైన స్కీములతో కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు రిప్రజెన్‌టేవి‌లకు ఒత్తిడి, చికాకులు తప్పవు.  
 
కుంభం: పుణ్య కార్యాల్లో నిమగ్నులవుతారు. బంధువుల రాకలోత పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. స్త్రీలకు అదనవు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
మీనం: ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిది కాదు. సామూహిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. 

అన్నీ చూడండి

సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా

గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం ద్వారా నార్కో-టెర్రర్‌ను నిర్మూలిస్తాం: హోం మంత్రి అమిత్ షా

కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...

17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..

Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..

శ్రీనివాసమంగాపురంలో జూలై 17 నుండి వార్షిక సాక్షాత్కార వైభవోత్సవాలు

ఆషాఢ బోనాల ఉత్సవాలు.. కుమ్మర కులస్తుల తొలి బోనాల సమర్పణ

తర్వాతి కథనం
Show comments