బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : గురువారం, 26 జులై 2018 (09:34 IST)

గురువారం (26-07-18) దినఫలాలు.. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి..

మేషం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ లక్ష్యసాధనకు పట్టుదల, ఓర్పు ముఖ్యమని గమనించండి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రాప్తించబోయే ధన

మేషం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ లక్ష్యసాధనకు పట్టుదల, ఓర్పు ముఖ్యమని గమనించండి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రాప్తించబోయే ధనానికి ముందుగానే ఖర్చులు ఎదురవుతాయి. 
 
వృషభం: విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయం సాధిస్తారు. వాహన ఛోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. త్వరలో గృహ మరమ్మత్తులు, మార్పులు చేపడతారు.
 
మిధునం: అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, వస్తులాభం వంటి శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచి చేస్తుంది.
 
కర్కాటకం: వస్త్ర, బంగారం, వెండి పనివారలకు, వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రుల కోపానికి గురవుతారు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. దంపతుల మధ్య అవగాహన కుదరదు. మీ సంతానం విషయంలో సంతృప్తి కానరాగలదు.
 
సింహం: రాబడికి మించిన ఖర్చులు ఎదుర్కొనుట వల్ల ఆందోళనకు గురవుతారు. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాలలోని వారికి చికాకులు తప్పవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులకు అశాంతి అధికం అవుతుంది. ఆడిటర్లకు మిశ్రమ ఫలితం. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కన్య:  ప్రైవేటు సంస్థలలోని వారికి, వృత్తులలోని వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇతర దేశాలు వెళ్లేందుకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తులపట్ల ఆరాధన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
తుల: లాయర్లకు లాభదాయకంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు జరపుతారు. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ఇతర దేశాలు వెళ్లేందుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తులపట్ల ఆరాధన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృశ్చికం: ఆర్థికంగా కలసివచ్చే కాలం. మనసు లగ్నం చేసి, పనిపై శ్రద్ధపెడితే ఆశించిన ఫలితాలు పొందుతారు. మిమ్మల్ని అభిమానించే వారి మనసు కష్టపెట్టకండి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు చీటికీ మాటికీ చికాకులు అధికమవుతాయి. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి.
 
ధనస్సు: చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఆటుపోట్లు తప్పవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక ఖర్చులు, ధనం సమయానికి అందక పోవటం వంటి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు, స్థిరచరాస్తులకు సంబంధించిన చర్చలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
 
మకరం: విద్యార్థులకు పాఠ్యాంశాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శెనగల వ్యాపారస్థులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం.
 
కుంభం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పును పొందుతారు. ఇతరులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడంవల్ల అశాంతికి లోనవుతారు. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి.
 
మీనం: బంధుమిత్రులకు సహాయ, సహకారాలు అందిస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలను కొనితెచ్చుకోకండి. అన్నివిధాలా మీదే పై చేయి అవుతుంది. కుటుంబంలో స్వల్ప విబేధాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. వస్తువుల కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.