Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు(12-07-2017)... కొత్త పరిచయాలతో లబ్ది...

మేషం : తోటివారి ఉన్నతస్థాయిలో పోల్చుకోవడం క్షేమం కాదు. రావలసిన ధనం కొంత ముందు వెనుకగానైనా అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. దూర ప్రయాణాల్లో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. నూతన కార్యక్రమాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు.

Written By Raman
Updated: మంగళవారం, 11 జులై 2017 (22:26 IST)
మేషం : తోటివారి ఉన్నతస్థాయిలో పోల్చుకోవడం క్షేమం కాదు. రావలసిన ధనం కొంత ముందు వెనుకగానైనా అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. దూర ప్రయాణాల్లో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. నూతన కార్యక్రమాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం: వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాల్లో సమస్యలు వస్తాయి. ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. 
 
మిథునం : వాతావరణంలో మార్పు రైతులకు ఊరటనిస్తుంది. బంధుమిత్రుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రతిష్టలకు కొంత విఘాతం కలిగే అవకాశం ఉంది. 
 
కర్కాటకం: మీ సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. శెనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది. 
 
సింహం : ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మీ అంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉందియ ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం వస్తువులను చేజార్చుకుంటారు. 
 
కన్య : ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మొహమ్మాటం ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫైనాన్స్, చిట్స్ రంగాల్లో వారికి ఓర్పు చాలా అవసరం.
 
తుల : విద్యుత్ రంగాల వారు ఒత్తిడి, చికాకులకు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. సమావేశాల్లో పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
వృశ్చికం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. శస్త్రచికిత్స చేయునప్పుడు వైద్యులకు మెళకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. కొత్త పరిచయాల వల్ల లభ్ధి పొందుతారు.
 
ధనుస్సు: వైద్యులకు శస్త్రచికిత్సల్లో ఏకాగ్రత, మెళకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు.
 
మకరం: ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. స్త్రీలకు సంభాషించినప్పుడు మెళకువ అవసరం. ఉద్యోగ, వ్యాపార విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తికావు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి ఒత్తిడి అధికమవుతుంది. పాత రుణాలు చెల్లిస్తారు.
 
కుంభం : ఉద్యోగస్తులు కొత్త  బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. ఆటో మొబైల్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి జయం చేకూరును. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మీ శ్రమ, సమర్థతలకు తగిన ప్రతిభ మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలు కాగలవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 
 
అన్ని రాశులవారు సత్యదేవుని పూజించి అర్చించిన అన్ని విధాలా శుభం, జయం చేకూరుతుంది.

అన్నీ చూడండి

మమతా బెనర్జీ కారుపై దాడి - వీడియో వైరల్

ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రాహుల్ గాంధీ

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ ప్రకటనలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు

ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు

అన్నీ చూడండి

10-08-2026 సోమవారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?

09-08-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

09-08-2026 నుంచి 15-08-2026 వరకు వార ఫలితాలు నేడు సాధ్యం కానిది రేపు...?

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

తర్వాతి కథనం
Show comments