మేషం : దూర ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. ఐరన్ రంగం వారికి ఆటంకాలు. కుటుంబంలోనూ ఇంటాబయట ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
వృషభం : ఆర్థిక లావాదేవీలు ఊహించని విధంగానే ఉంటాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. మీ నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. రాజీమార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. స్త్రీల ప్రతిభకు అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులతో నిజాయితీగా మెలగండి.
మిథునం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. భవిష్యత్లో ఖర్చులు, ఇతరాత్రా చెల్లింపులు అధికంగా ఉంటాయి. మీ సేవాదక్షత, కార్యదీక్షలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
కర్కాటకం : పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులకు స్థానచలనం, బాధ్యతల మార్పు సంభవం.
సింహం : ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు రుణాలు తీరుస్తారు. గృహానికి కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మీ సంకల్పానికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా అవసరమని గమనించండి. ఉద్యోగస్తులు పైఅధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం.
కన్య : వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టసాధ్యం. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి.
తుల : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బంగారం వెండి గృహోపకరణాల వ్యాపారులకు శుభదాయకం. ఓర్పు, సహనంతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
వృశ్చికం : మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరిగా వ్యయం చేస్తారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఏ యత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు.
ధనస్సు : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు మంచిమంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసే పై అధికారుల మన్నలను పొందుతారు.
మకరం : రాజకీయ నాయకుల సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు హడావుడి తొందరపాటుతగదు. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు.
కుంభం : వ్యాపారాల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు అధిక శ్రమ, ఒత్తిడికి లోనవుతారు. సంఘంలో మంచి, పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
మీనం : సేవా సంస్థలకు విరాళాలివ్వడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. ఫ్లీడరు నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.