మీ రాశి ఫలితాలు (28-07-2017)... ఈ రోజు ఇలా వున్నాయి...

మేషం : ఈరోజు గృహనిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా కొనసాగుతాయి. మీ సమస్యలు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. మీరు అమితంగా అభిమానించే వారిని కలుసుకుంటారు. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు.

శుక్రవారం, 28 జులై 2017 (05:06 IST)
మేషం : ఈరోజు గృహనిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా కొనసాగుతాయి. మీ సమస్యలు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. మీరు అమితంగా అభిమానించే వారిని కలుసుకుంటారు. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది.
 
వృషభం : ఈరోజు రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. బంధువుల రాక పట్ల స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి చికాకులు తప్పవు.
 
మిథునం : ఈరోజు దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాంతంగా ఉండటానికి ఎక్కువుగా ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయీల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కర్కాటకం : ఈరోజు వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. వ్యాపార, ఉపాధి పథకాల్లో చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది.
 
సింహం : ఈరోజు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయదార్లకు అనుకూలంగా ఉండును. కళా రంగాలలోని వారికి అనుకూలమైన కాలం. విద్యార్థులకు ఏకాగ్రతలోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు.
 
కన్య : ఈరోజు అనందకరమైన హృదయంతో ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. స్త్రీలకు కొత్తకొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు.
 
తుల : ఈరోజు స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందుకెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. శత్రువుల సైతం మిత్రులగా మారి సహాయం అందిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లు రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, క్రమశిక్షణ ముఖ్యం. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది.
 
వృశ్చికం : ఈరోజు ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. విదేశీయానయత్నాలు కొంతవరకు అనుకూలించగలవు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల మీ కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.. మెళకువ వహించండి.
 
ధనస్సు : ఈరోజు సాహిత్య సదస్సులలోనూ, బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అనుభవాలను ముఖ్యులతో పంచుకుంటారు. వడ్డీలు, డిపాజిట్లు చేతికందుతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. మీకున్నదాంతో సంతృప్తి చెందకండి. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు.
 
మకరం : ఈరోజు ఎలక్ట్రానికల్, వైజ్ఞానిక, శాస్త్ర, కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. ఉద్యోగంలో శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్త అవసరం.
 
కుంభం : ఈరోజు బదిలీలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొబ్బరి పండ్ల, పానీయ వ్యాపారస్తులకు శుభదాయకం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో ఇబ్బందులెదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. గతంలో మిమ్మలను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. 
 
మీనం : ఈరోజు దైవకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. రవాణా, ఆటోమొబైల్ రంగాలలోని వారికి మంచి అవకాశాలు లభించి పనిభారం అధికమవుతుంది. సమయానికి కావలసిన ధనం సర్దుబాటుకాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత నెలకొంటుంది.

అన్నీ చూడండి

రీ-నీట్‌ 2026కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం - టెలిగ్రామ్ సేవలు నిలిపివేత

హోర్ముజ్ జలసంధి ద్వారా టోల్ ఫ్రీ షిప్పింగ్ ప్రారంభం.. డొనాల్డ్ ట్రంప్

ఆస్ట్రేలియన్లు వార్తా పత్రికలు చదవట్లేదట.. కారణం ఏంటంటే?

మల్కాపురంలో నావికాదళ అధికారి భార్య ఆత్మహత్య

వైమానిక దళ అధికారి భార్యపై అత్యాచారానికి పాల్పడిన పాత స్నేహితులు... ఎక్కడ?

అన్నీ చూడండి

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments