కలలో కుక్క కరిచినట్లు వస్తే... పక్షి ఎగిరినట్లు కనిపిస్తే... ఇంకా...?

నమ్మినా నమ్మకున్నా మన పూర్వీకులు కలలకు కొన్ని అర్థాలు చెప్పారు. అవేంటో ఒక్కసారి చూద్దాం. కలలో కుక్క మిమ్ములను కరిచినట్లు కనపడితే లేదా కుక్కను పెంచుకుంటున్నట్లు కలవస్తే... కష్టాలు వచ్చే సూచనలున్నాయి. కలలో ఎగురుతున్న పక్షిని చూస్తే మీకు గౌరవం లభిస్తుంద

గురువారం, 20 అక్టోబరు 2016 (20:10 IST)
నమ్మినా నమ్మకున్నా మన పూర్వీకులు కలలకు కొన్ని అర్థాలు చెప్పారు. అవేంటో ఒక్కసారి చూద్దాం. కలలో కుక్క మిమ్ములను కరిచినట్లు కనపడితే లేదా కుక్కను పెంచుకుంటున్నట్లు కలవస్తే... కష్టాలు వచ్చే సూచనలున్నాయి. కలలో ఎగురుతున్న పక్షిని చూస్తే మీకు గౌరవం లభిస్తుంది.
 
నెమలిని చూస్తే దుఃఖం కలుగుతుంది. మీ పెళ్ళిని మీరు మీ కలలో చూస్తే... ఇబ్బందులెదుర్కోక తప్పదు. కలలో నుదుట కుంకుమ సింగారిస్తున్నట్లు కనపడితే... శుభకార్యం జరుగుతుందని భావించాలి. కలలో అద్దం చూస్తే... మనసు కకావికలమౌతుందంటున్నారు జ్యోతిష్యులు.
 
రైలులో ఎక్కుతున్నట్లు కలవస్తే... యాత్ర చేస్తారని భావించాలి. నిద్రలో కాలుజారి పడినట్లు కలవస్తే... అధోగతి పాలయ్యే ప్రమాదానికి సూచన. మీకు ఆవు దొరికినట్లు కలవస్తే... భూలాభం ఉంటుంది. గుర్రం నుంచి కింద పడినట్లు కలవస్తే... పదవీత్యాగం చేయాల్సివుంటుంది. గుర్రంపై ఎక్కినట్లు కలవస్తే... పదవిని పొందుతారు. 
 
మీరు చనిపోయినట్లు కలలో కనపడితే... మీకున్న అన్నిరకాల బాధలు తొలగిపోయినట్లేనంటున్నారు జ్యోతిష్యులు. ఇదేవిధంగా సముద్రం, వికసిస్తున్న పూలు, యువతితో కలవడం లేదా చూడటం, ప్రసాదం లభించినట్లు కలవస్తే, ఆశీర్వాదం తీసుకున్నట్లు, పుస్తకం చదువుతున్నట్లు, పాము కరవడం, ఆలయాన్ని చూడటం, నగలు దొరకడం లాంటి కలలు ఇంకా ఏనుగుపై సవారీ చేయడం, పండ్లు తీసుకున్నట్లు కలలు రావడం, అలాగే శరీరంపై పేడ పూసినట్లు కనపడటం లాంటి కలలు వస్తే ధనలాభం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. 
 
అలాగే మీ కలలో రక్తం చూడటం, స్తనపానం చేస్తున్నట్లు, మద్యం, నూనె సేవిస్తున్నట్లు, మిఠాయి తినడం, వివాహం జరిగినట్లు, పోలీసును కలలో చూడటం లాంటివి, తమరు గుండు గీయించుకున్నట్లు కలలో కనపడితే మరణ వార్త వినాల్సి వస్తుంది. విధవకు గెడ్డం పెరగడం లాంటి దృశ్యం కలలో కనపడితే... పునర్వివాహం జరిగే సంకేతాలున్నాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే వారితో వియోగం లేదా సంబంధాలు బెడిసికొట్టే సందర్భాలకు సంకేతాలుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు.

అన్నీ చూడండి

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

తర్వాతి కథనం
Show comments