పాదమునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో..?
చాలామందికి పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటాయి. వారేమో.. ఎందుకు నాకిలా మచ్చలు వస్తున్నాయని చింతిస్తుంటారు. కానీ, పండితులు ఏమంటున్నారంటే.. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు రావడం అనేది శుభదాయకమని చెబుతున్నారు. పుట్టమచ్చ అనేది పుట్టుకతోనే వస్తుంది.. కాబట్టి దీని వలన ఎలాంటి సమస్యలు తలెత్తవని కూడా వెల్లడించారు. మరి ఈ పుట్టుమచ్చలు పాదాలపై ఉంటే.. వారు ఎలాంటి వారై ఉంటారో తెలుసుకుందాం...
కుడి పాదమునకు కుడిభాగాన పుట్టుమచ్చ ఉన్నచో వారు సూక్ష్మబుద్ధి గలవాడును, దూరాలోచన చేయువాడై, పట్టుదల గలవాడును, వ్యవహారములందు జాగ్రత్తగా సంచరించువాడును, పరోపకారబుద్ధి కలవాడును, పుణ్యతీర్థములను సేవించువాడై యుంటారు. అంతేకాదు, పుణ్యనదులలో స్నానం చేయును, సాధుజనులను దర్శించుచు.. దేవగురు బ్రాహ్మణ భక్తి కలిగియుండువాడగును.
ఎడమ పాదముపై కుడిభాగాన మచ్చ ఉన్నచో వారు.. సామాన్యభోగమును అనుభవిస్తారు, పెద్దలను తిరస్కరించువాడైయుంటారు. ముఖ్యంగా ఇతరులను నిందించువాడు, గురుదేవబ్రాహ్మణులను తిరస్కారభావంతో చూస్తారు, దరిద్రముతోను, మనోవిచారములతోను, వ్యాధులతోను బాధలు పడుతుంటారు. చివరగా వారు దురాశగలవాడై ఉంటారు.