శుక్రవారం, 1 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (17:18 IST)

కాశిలో కోటి లింగాలను ప్రతిష్ఠించినా సరే.. లలితాసహస్ర నామంతో?

Lalitha Sahasranam
లలిత, మహాత్రిపురసుందరి, శివుని నుంచి వేరు చేయలేని శక్తి రూపాలు. వీరి శివశక్తిలో ఐక్యం. అలా లలితాసహస్రనామం అంటే అమ్మను వేయి పేర్లతో కొలవడం అని అర్థం. లలితాసహస్ర నామం పారాయణం చేసేటప్పుడు, లలితాంబికాదేవి గొప్పతనం రహస్యాలు, సంపూర్ణ జ్ఞానం ఏర్పడుతుంది. లలితాసహస్ర నామం చదవడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
 
చదువుల తల్లి సరస్వతీ దేవి గురువైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి లలితా సహస్ర నామ గొప్పదనాన్ని పేర్కొన్నారు. దేవికి సంబంధించిన సహస్ర నామాలు అగస్త్యునికి చెప్పడం జరిగింది. ఈ స్తుతి చాలా మహిమాన్వితమైంది. ఇది రోగాలను పటాపంచలు చేస్తుంది. సంపదను పెంచుతుంది. అపమృత్యు దోషాలను తొలగిస్తుంది. సంతానప్రాప్తిని ఇస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయుర్దాయాన్ని పెంచుతుంది. 
 
గంగానది లాంటి పవిత్ర తీర్థంలో పలుమార్లు స్నానమాచరించడం, కాశీలో కోటి లింగాలను ప్రతిష్ఠించడం, గ్రహణ సమయంలో గంగానదీ తీరంలో అశ్వమేధ యాగం చేయడం, అన్నదానం చేయడం వీటి అన్నింటికంటే.. చాలా పుణ్యమైనది లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం. ఇది పాపాలను హరిస్తుంది. 
 
పాపకర్మలను తొలగించి.. జీవితాన్ని సత్మార్గంలో నడిపిస్తుంది. పౌర్ణమి రోజు చంద్రబింబాన్ని సందర్శించుకుని.. లలితా సహస్ర నామాన్ని పఠించడం ద్వారా రోగాలు దూరమవుతాయి. భూతపిశాచ భయం తొలగిపోతుంది. 
 
ఈ లలితాసహస్రనామ పారాయణం చేసే చోట సరస్వతీ దేవి కొలువైవుంటుంది. శత్రుభయం వుండదు. పూర్వజన్మ పుణ్య ఫలంతోనే ఈ లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం కుదురుతుంది. 
 
ఇదే చివరి జన్మ అనే వారికి మాత్రమే లలితా సహస్ర నామ పారాయణం ఫలం దక్కుతుంది. లలితా సహస్ర నామ ఫలశ్రుతి కారణంగా పుణ్యఫలం చేకూరుతుంది. కాబట్టి రోజూ లలితా సహస్ర నామాన్ని పఠించడం మరిచిపోకండి.