ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (16:48 IST)

గేయ రచయిత శివశక్తి దత్త ఆవిష్కరించిన ప్రేమకు జై టీజర్

Sivashakti Dutta and Premuku Jai team
Sivashakti Dutta and Premuku Jai team
అనసూర్య  నిర్మించిన చిత్రం 'ప్రేమకు జై'.  గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం  దర్శకత్వంలో ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపోందింది. అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సరంలో విడుదల కానుంది. తాజాగా ప్రఖ్యాత లిరిక్స్ రైటర్ శివశక్తి దత్త చేతుల మీదుగా పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.
 
 ఆనంతరం శివశక్తి దత్త గారు మాట్లాడుతూ, యంగ్ టాలెంట్ బాగా చేశారు. నూతన న‌టీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్  చాలా బాగుంది. ఈ టీజర్ చాలా బాగుంది. చిత్ర యూనిట్  శుభాకాంక్షలు'' అన్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు... 
 
దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం , నిర్మాత:  అనసూర్య, లైన్ ప్రొడ్యూసర్:  మైలారం రాజు, కెమెరా: ఉరుకుందా రెడ్డి,  మ్యూజిక్ : చైతు.