శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (19:54 IST)

మౌని అమావాస్య: ఆవులకు పాలకూర, అరటిపండు ఇస్తే..?

పౌర్ణమి రోజున దేవతా పూజలు ప్రముఖంగా జరుగుతాయి. అమావాస్య రోజు, మన పూర్వీకులను పూజించడానికి అనువైన రోజు. తిథుల్లో అమావాస్య తిథి చాలా ముఖ్యమైనది. అమావాస్య నాడు ఏ గ్రహ ప్రభావం పనిచేయదు. 
 
కాబట్టి అమావాస్య రోజున కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తే అది విజయవంతమవుతుంది. అలాంటి పవిత్రమైన మౌని అమావాస్య (ఫిబ్రవరి 9) పూజతో అష్టైశ్వర్యాలు సొంతం చేసుకోవచ్చు. రాహు-కేతువులు, గ్రహాల వల్ల వచ్చే సమస్యలు పోవాలంటే అమావాస్య పరిహారాలు చేయాలని చెబుతారు.
 
ఈ రోజున మనం పూర్వీకులు చాలా ఆకలిగా, దాహంతో ఉంటారట. అందుకే వారికి తర్పణం ఇవ్వడం విశేషం. దర్పణ జలం భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే మహత్తైనదని విశ్వాసం.  పూర్వీకుల కోసం, వారు కోట్లాది మైళ్ల దూరంలో ఉన్నా, విశ్వాంతరాళంలో ఉన్నా, తర్పణం ఇవ్వడం, నైవేద్యాలను సమర్పించడం ద్వారా వారి దాహాన్ని, ఆకలిని తీర్చవచ్చు. ఇలా మనం సమర్పించే తర్పణాన్ని పితరులు సూక్ష్మంగా స్వీకరిస్తారని.. ఆపై ఆశీర్వదిస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
అమావాస్య రోజున నిరుపేదలకు ఆహారం అందించవచ్చు. సమీపంలోని ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ రోజున పూర్తి ఉపవాసం పాటించాలి. మాంసాహారం తినకూడదు. ఆవులకు పాలకూర, అరటిపండు, చింతపండు, బెల్లం మొదలైనవి ఇవ్వవచ్చు. రావిచెట్టును పూజించవచ్చు. పేదలకు ఆహారం, దుస్తులు అందించవచ్చు. గోళ్లను కత్తిరించడం, హెయిర్ కటింగ్, ఫేస్ షేవింగ్ వంటివి చేయకూడదు.
 
అమావాస్య పూజతో ఆనందం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి వుంటుంది. ఆస్తి సుఖాలు పెరుగుతాయి. వాహన యోగం కలుగుతుంది. అనారోగ్యం వుండదు. జాతకంలో దోషాలు తొలగి లాభాలు కలుగుతాయి. శాపాలు తొలగిపోయి వరాలుగా మారుతాయి. ఈ రోజున భగవద్గీత పారాయణం, గాయత్రీ మంత్ర పఠనం చేయాలి. బ్రాహ్మణులకు దానం చేయాలి. కాల సర్ప దోష పూజను నిర్వహించడం మంచిది. భక్తులు కాకులు, శునకాలు, చీమలు, ఆవులకు కూడా ఆహారం ఇవ్వాలి.