సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (19:05 IST)

పౌర్ణమి, అమావాస్యకు ఐదో రోజు- పంచభూతాలను ఇలా పూజిస్తే? (video)

పంచభూతాలను పూజిస్తే కలిగే ఫలితాలేంటో తెలుసుకోవాలా.. అయితే చదవండి. భూమి, వాయువు, నీరు, అగ్ని, ఆకాశం అనేవి పంచభూతాలు. మనం చేసే ప్రతి పనీ పంచభూతాల ఆధారంగానే నడుస్తాయి. ప్రపంచం పంచభూతాల ఆధారంగా నడుస్తోంది. అలాంటి పంచభూతాల దోషాలను తొలగించుకోవాలంటే.. రోజూ వాటిని స్మరించుకోవాలి. నిద్రలేవగానే భూమిపై కాలు పెట్టేటప్పుడు భూమాతకు కృతజ్ఞతలు తెలపాలి. 
 
నీటిని సేవించేటప్పుడు నీటికి, గాలిని పీల్చేటప్పుడు వాయువుకు, ఆహారం వండేటప్పుడు అగ్నిదేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఇక ఆకాశానికి సూర్యనమస్కారం ద్వారా రోజు కృతజ్ఞతలు తెలిపితే.. పంచభూతాలు మనం నిర్వర్తించే కార్యాలకు తోడ్పడుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. పంచభూతాలను ఆరాధించడంతో పాటు.. వాటిని స్మరించడం ద్వారా అనారోగ్య సమస్యలంటూ వుండవు. 
 
పంచభూత శక్తులు కలిగిన ఐదు మూర్తులు బ్రహ్మదేవుడు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు, విష్ణువు. పంచశక్తులు కలిగిన శక్తి అమ్మవారికి వుంది కావున.. వీరిని స్తుతిస్తే ఈతిబాధలుండవు. ఇంకా పంచభూతాల శక్తి మనకు లభిస్తుంది. అందుకే అమావాస్య ముగిసిన ఐదో రోజు, పౌర్ణమి ముగిసిన ఐదో రోజు మహా పంచమి తిథి వస్తుంది. 
 
ఆ రోజున పంచముఖ దీపాన్ని, ఐదు రకాల నూనెతో వెలిగించి పూజించాలి. ఆ సమయంలో "ఓం శ్రీ పంచమీ దేవియే నమ:'' అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆపై పండ్లు, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి.. పూజ చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు.