శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (16:53 IST)

''శ్రీ'' చక్రం మహిమను గురించి తెలుసుకోవాలంటే? ఇంట్లో వుంటే? (video)

''శ్రీ'' చక్రం మహిమను గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. మానవుల ఈతిబాధలు, కష్టనష్టాలను తొలగించుకునేందుకు శ్రీ చక్రం ఉపయోగపడుతుంది. ప్రపంచాన్ని రక్షించే రాజరాజేశ్వరి అమ్మవారే ముల్లోకాలను, ముమ్మూర్తులకు అధిదేవత. శ్రీ చక్ర అన్నీ యంత్రాలకు మూలం.

శ్రీ చక్రాన్ని శ్రీచక్ర రాజం అంటారు. శ్రీ చక్రాన్ని తొమ్మిది విభాగాలుగా పూజిస్తారు. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవ చక్రం అని కూడా పిలుస్తారు.  శ్రీ చక్రంలోని తొలి త్రిభుజంలో గురుభగవానుడు నివాసం వుంటాడు. ఈయన్ని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు వుండవు. ఆటంకాలు తొలగి బుద్ధి వికాసం చేకూరుతుంది. 
 
రెండో త్రిభుజం 16 యోగులు నివాసం చేసే ప్రాంతం. ఇది తామరపువ్వులాంటి రూపాన్ని కలిగివుంటుంది. ఇది మానసిక అనాలోచిత నిర్ణయాలను దూరం చేస్తుంది. మూడవ త్రిభుజం బుద్ధి వికాసాన్నిస్తుంది. భక్తి పెంపొందుతుంది. 
 
నాలుగో త్రిభుజం 14 యోగులు నివాసం చేసే ప్రాంతం. దీనిని పూజించడం ద్వారా పుత్ర ప్రాప్తి చేకూరుతుంది. ఐదు- ఆరోగ్యం, మానసిక వికాసం, ఆరవ త్రిభుజం-సూర్యుడి ఆకారంలో వుంటుంది. అహంకారాన్ని పోగొట్టి, బుద్ధి విజ్ఞానాన్ని ఇస్తుంది. ఏడవ త్రిభుజం.. బుధుని గ్రహాన్ని సూచిస్తుంది. దీనిని పూజించడం ద్వారా ఆత్మ జ్ఞానం చేకూరుతుంది. 
 
ఎనిమిదో త్రిభుజం.. మహా త్రిపుర సుందరి మాతను సూచిస్తుంది. తొమ్మిదో త్రిభుజం.. భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది. అర్థనారీశ్వర స్వామిని ఈ త్రిభుజం సూచిస్తుంది. మొత్తానికి మహా మేరు యంత్రంగా పేరున్న శ్రీ చక్రాన్ని పూజించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. 
 
'శ్రీ'అనేది మహావిష్ణువుకు ... లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం. 'శ్రీ' అనే అక్షరం ఎంతటి పవిత్రమైనదో ... 'శ్రీ యంత్రం' అంతటి శక్తివంతమైనది. యంత్రంలేని పూజ వలన ప్రయోజనం ఉండదనేది శాస్త్ర వాక్యం. అందువలన ప్రతి దేవాలయంలోను యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. లక్ష్మీనారాయణుల స్వరూపమైన 'శ్రీ యంత్రం' బంగారం, వెండి, రాగి, ఇలా ఏడు లోహాలను కలిపి తయారు చేస్తారు. 
 
ఈ 'శ్రీ'యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేయడం వలన ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి ... అకాల మృత్యువు బారి నుంచి అనుక్షణం రక్షణ లభిస్తుంది. అయితే ఎంతో నియమ నిష్టలను పాటించవలసి వుంటుంది. అలా ఇంట్లో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించని పక్షంలో.. శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసిన ఆలయాలను సందర్శించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
ఇక మహిమాన్వితమైన ఈ శ్రీ యంత్రాన్ని పూజించడానికి కార్తీక, మాఘ, వైశాఖ, జ్యేష్ట మాసాలు, పంచమి, సప్తమి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు, బుధ,  గురు, శుక్రవారాలు, పుష్యమి, హస్త, ఉత్తర, ఫల్గుణి, స్వాతి, రేవతి.. నక్షత్రాలు మంచివని శాస్త్రం చెబుతోంది.