Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఎరుపు బట్టలో రాళ్ళ ఉప్పును వుంచి ప్రధాన ద్వారానికి కడితే?

ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది. ప్రతికూల ప్రభావం, స్వభావం కలిగి వుండే వారు మీ చుట్టూ వున్నా.. లేకుంటే ఇంట్లో ప్రతికూల శక్తులను వ్యాపించే శక్తులున్నా.. వాటికి ఉప్పుతో చెక్

Written By Selvi
Updated: బుధవారం, 9 ఆగస్టు 2017 (16:37 IST)
ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది. ప్రతికూల ప్రభావం, స్వభావం కలిగి వుండే వారు మీ చుట్టూ వున్నా.. లేకుంటే ఇంట్లో ప్రతికూల శక్తులను వ్యాపించే శక్తులున్నా.. వాటికి ఉప్పుతో చెక్ పెట్టవచ్చును. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు వుండవు. ఇంకా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పును తీసుకుని నీళ్లల్లో వేసి ఇంటిని తుడిచేయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగటివ్ శక్తులన్నీ తొలగిపోతాయి. 
 
అలాగే ఒక గ్లాసుడు నీటిలో చిటికెడు ఉప్పును చేర్చి ఇంట్లోని నైరుతి దిశలో వుంచాలి. ఇలా వుంచిన నీరు రంగు మారితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులున్నాయని గ్రహించాలి. ఆ నీటిని అప్పుడప్పుడు మారుస్తూ.. కొత్త నీటిలో ఉప్పు చేర్చి పెట్టడం చేస్తుండాలి. పిడికెడు రాళ్ల ఉప్పును తీసుకుని ఒక బౌల్‌లో వేసి.. దాన్ని బాత్రూమ్‌లోని ఓ మూలలో వుంచాలి. దీన్ని ఏడు రోజులకు ఓసారి మారుస్తూ వుండాలి. ఇలా చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు పరారవుతాయన్నారు. 
 
ఇక ఇంటికి ప్రధాన ద్వారంలో ఎరుపు రంగు గుడ్డలో కాస్త రాళ్ల ఉప్పు చేర్చి కట్టినట్లైతే.. ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోయి.. సానుకూల ఫలితాలు వస్తాయి. ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్‌పై ఎప్పుడూ ఉప్పును ఉంచితే సిరిసంపదలు పెరుగుతాయని విశ్వాసం. స్నానం చేసే నీటిలో పిడికెడు ఉప్పు చేర్చి.. 20 నిమిషాల పాటు స్నానం చేస్తే.. ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments