ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (15:30 IST)

2017లో 12 రాశులపై శని ప్రభావం... ధనుస్సుకు సంక్షోభాలు తప్పవ్.. మంగళ,శనివారాలు ఏం చేయాలంటే?

శని ప్రభావం 2017లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలా.. 12 రాశులపై శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. ఇప్పటివరకు శని ప్రభావం వృశ్చిక రాశిపై ఉండేది. 2017 జనవరి 26 నుంచి శని ధనుస్సు

శని ప్రభావం 2017లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలా.. 12 రాశులపై శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. ఇప్పటివరకు శని ప్రభావం వృశ్చిక రాశిపై ఉండేది. 2017 జనవరి 26 నుంచి శని ధనుస్సు రాశిపై ప్రభావం చూపించబోతోంది. ఆ తర్వాత 2020లో మకర రాశిలో శని ప్రభావం చూపించనుంది. ఇప్పుడు 2017లో ఏ రాశిపై శని ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.  
 
మేషరాశి
మేషరాశి జాతకులపై శని ప్రభావం ఎక్కువగా ఉండదు. శని ప్రభావం వీరికి అనుకూలిస్తుంది. 2017లో మేషరాశి వాళ్లకు ఆర్థికంగా లాభాలు, వాణిజ్య రీత్యా అభివృద్ధి గడిస్తారు. అలాగే కొన్ని మంచి బిజినెస్ డీల్స్ అందుకుంటారు. అయితే మిమ్మల్ని వెనక్కి లాగాలని భావించే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 
వృషభ రాశి 
ఈ రాశి జాతకులపై కోపం ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పనీ, చెప్పే ప్రతి విషయంపై ఆలోచించి, ఆచితూచి వ్యవహరించాలి. నోరు జారకూడదు. 
 
మిథునరాశి 
మిథున రాశి జాతకులకు శనిప్రభావం కాస్త మంచి ఫలితాన్ని ఇస్తాయి. కష్టానికి ఫలితం దక్కుతుంది. గుర్తింపు లభిస్తుంది. 2017లో కోరుకున్న లక్ష్యాన్ని నేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు. మీ బంధువులు, సోదరీ సోదరులతో బంధం బలపడుతుంది. అయితే ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
 
కర్కాటక రాశి
2017 కర్కాటక రాశివాళ్లకు మంచి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. 
 
సింహరాశి
పెళ్లికాని సింహరాశి వాళ్లకు పెళ్లి జరుగుతుంది. అలాగే 2017లో రొమాంటిక్ రిలేషన్‌లోకి అడుగుపెడతారు. ఈ రాశివాళ్ల వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. అలాగే మీ తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
 
కన్యారాశి
కన్యారాశి వాళ్లు 2017చాలా బిజీ బిజీగా ఉంటారు. వృత్తిపరంగా లక్ష్యాలు నెరవేరుతాయి. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో గడిపే సమయం తగ్గుతుంది. కాబట్టి మీ కుటుంబంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగానికి ఇచ్చేంత ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది.
 
తులారాశి
ఇప్పటివరకు శని ప్రభావంతో బాధపడిన తులారాశివాళ్లకు ఈ ఏడాది 2017లో పూర్తవబోతోంది. తులారాశివాళ్లపై ఇప్పటివరకు ప్రభావం చూపిన శని 2017లో తప్పుకోబోతున్నాడు. శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. అయితే మెల్లమెల్లగా వీరికి శుభఫలితాలుంటాయి. 
 
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివాళ్లపై శని ప్రభావం ఉండే చివరి రోజులు. ఈ సమయం వీళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీరి ధృఢమైన మనస్సు కలవారు. నెమ్మదిగా జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతున్నాయనే భావన కలుగుతుంది. కొత్త జీవితం మీకోసం ఎదురుచూస్తూ వుంటుంది. 
 
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో పుట్టిన వాళ్లు 2017లో శని ప్రభావాన్ని చూడాల్సి ఉంటుంది. చాలా సంక్షోభాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతపరంగా శని ప్రభావాన్ని చవిచూస్తారు. కానీ ఈ ఏడాది కష్టాలను భరించేందుకు దైవభక్తి అవసరం. ఆ ధైర్యం, బలం దైవభక్తితో దైవతారాధానతో లభిస్తుంది.
 
మకరరాశి 
మకర రాశివాళ్లపై శనిప్రభావం 2017లో మొదలవుతుంది. అయితే ఈ ఏడాది మీకు విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. అలాగే కొన్ని అద్భుతమైన వ్యాపార డీల్స్‌ని అందుకుంటారు.
 
కుంభరాశి
కుంభరాశి వాళ్లకు 2017లో ఆర్థికంగా చాలా మంచి సంవత్సరం. వీళ్లకు బాగా కలిసొస్తుంది. అలాగే వృత్తిపరంగానూ మంచి ఆఫర్లు వస్తాయి.
 
మీన రాశి
మీనరాశి వాళ్లు ఈ ఏడాది ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతరుల సలహాలను పాటిస్తూనే, దైవతారాధనతో శుభ ఫలితాలను పొందవచ్చు. 
 
ఇక 12 రాశుల వారు 2017 శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే.. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవాలి. లేదా హనుమాన్ పూజ చేయాల్సి వుంటుంది. ఆంజనేయస్వామి దేవాలయాన్ని ప్రతి మంగళవారం దర్శించుకోవడం ద్వారా సకల శుభాలను పొందవచ్చు. అలాగే హనుమాన్‌‍తో పాటు శనిదేవుడిని పూజించడం చాలా అవసరం. ప్రతి శనివారం శని ఆలయానికి వెళ్లడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.
 
ఇక నలుపు రంగు వస్త్రాలు, నల్లాటి ధాన్యాలను పేదలకు దానం చేయడం మంచిది. శనివారం ఈ దానాలు చేయడం మంచిది. అలాగే ఆలయ పూజారికి లేదా పేదవాళ్లకు ఉద్ది పప్పు దానం చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా శని ప్రభావంతో ఏర్పడే కష్టాలు మెల్ల మెల్లగా తొలగిపోతాయని పంచాంగ నిపుణులు సెలవిస్తున్నారు.