Festival Posters
✕

శ్రావణ మాసం.. శని ప్రదోషం.. నందిని, శివుడిని పూజిస్తే..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 14 జులై 2023 (13:19 IST)
త్రయోదశి తిథి నాడు శివుని ఆరాధనకు అంకితమైన ప్రదోష వ్రతం పాటిస్తారు. అదీ శ్రావణ మాసంలో వచ్చే శని ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. శని ప్రదోష వ్రతం శనివారం అంటే 15 జూలై 2023న వస్తోంది. 
 
శనివారం నాడు రావడం వల్ల శని ప్రదోష వ్రతం అంటారు. ప్రదోష వ్రతం రోజున శివుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.  
 
శని ప్రదోష వ్రతం రోజున శివుడిని పూజించాలని, అభిషేకం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది. దీనితో పాటు, ఈ రోజున శని దేవుడికి ఆవనూనెతో దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
అలాగే శనివారం వచ్చే ప్రదోషం రోజున శివుని వాహనమైన వృషభ వ్రతం ఆచరించాలి. వృషభ రాశి వారు ఉపవాసం ఉండాలని, శివునికి ఈ ఉపవాసం అత్యంత ప్రభావవంతమైనదని చెబుతారు.  
 
ప్రదోషం నాడు ఈ వృషభ వ్రతం ఆచరిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతారు. ఉపవాసం రోజున తెల్లవారుజామున నిద్రలేచి శివుడిని నైవేద్యంగా పెట్టి ఆహారం తీసుకోకుండా వృషభుడిని పూజించాలని చెబుతారు.
 
అలాగే శివునికి ఇష్టమైన బియ్యంతో చేసిన అన్నం, పాయసంతో శివ మంత్రాలు పఠిస్తూ ఉపవాసం ఉంటే కోటీపుణ్యం లభిస్తుందని చెబుతారు. ఆహారం లేకుండా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు మాత్రమే తినాలని సూచించారు.
 
ప్రతి ప్రదోష రోజున శివాలయంలో నందిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయని మన పూర్వీకులు చెప్పారు. ప్రదోష రోజున ధ్యానం చేస్తూ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

అన్నీ చూడండి

ఆరోగ్య శాఖలో కలకలం - నకలీ డెత్ సర్టిఫికేట్లతో కారుణ్య ఉద్యోగాలు

బంజారా హిల్స్‌లో పట్టపగలు దారుణ హత్య.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు... (వీడియో)

ఉద్యోగులకు దీపావళి కానుక : నగదు కట్టలు! (వీడియో)

సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అన్నీ చూడండి

08-11-2026 దీపావళి నాటి రాశి ఫలితాలు- కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు

07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

తర్వాతి కథనం
Show comments