శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (14:09 IST)

శివ ప్రదోష స్తోత్రము.. సాయంత్రం 4.30 గంట నుంచి..

Lord shiva
శివ ప్రదోష స్తోత్రాన్ని ప్రదోష వేళ సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల వరకు పఠిస్తే సర్వం సిద్ధిస్తుంది. అభీష్టాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
 
కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం |
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే ||
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ |
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే ||
 
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః |
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా ||
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా |
సేవంతే తమనుప్రదోష సమయేదేవంమృడానీపతిమ్ ||‌
 
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య |
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ ||
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః |
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః ||